Dog skateboarding Funny Video: కుక్కలకు, పిల్లులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అవి చేసే కొన్ని పనులు భలే నవ్వు తెప్పిస్తూ ఉంటే కొన్ని మాత్రం ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఓ కుక్క అచ్చం మనిషి లాగానే స్కేటింగ్ బోర్డుపై ఎక్కి స్కేటింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను Buitengebieden అనే ఎక్స్( ట్విటర్) పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూస్తున్న వారు ఆ కుక్క చేస్తున్న పనులు చూసి వావ్ అంటున్నారు. ఇక మధ్యలో కుక్కకు టాయిలెంట్ రావడంతో అది ఆగి రోడ్డు పక్కన పద్దతిగా టాయిలెట్ పోసి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
Also Read:Snake Viral video: కోపంలో కసిగా మరో పామును కాటు వేసిన భారీ పాము.. చూస్తే భయపడాల్సిందే
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క స్కేటింగ్ చేస్తూ ఉంటుంది. మధ్యలో దానికి టాయిలెట్ వస్తుంది. అది వెంటనే స్కేటింగ్ బోర్డు నుంచి దిగి రోడ్డు దగ్గర ఓ మూలకు వెళ్లి టాయిలెట్ పోస్తుంది. మళ్లీ వచ్చి స్కేటింగ్ బోర్డుపై ఎక్కి వెళ్లిపోతుంది. అది స్కేటింగ్ బోర్డు ఎక్కేటప్పుడు అచ్చం మనిషి లాగానే మొదటి దాని ముందర కళ్లు పెట్టి కొద్దిగా ముందుకు నెట్టి తరువాత దాని పైకి ఎక్కుతుంది. చాలా ప్రొఫెషనల్ స్కేటర్ చేసినట్లు అది స్కేటింగ్ చేస్తుంది. ఇక అది అలా వెళుతున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్ కూడా వస్తుంది. అయినా ఆ కుక్క తొనక్కుండా, బెనక్కుండా చక్కగా వెళ్లిపోతుంది. అది రోడ్డుపై అలవోకగా స్కేటింగ్ చేస్తోంది. అంతేకాకుండా ఆ కుక్కకు స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండే విషయం కూడా బాగా తెలిసినట్టు ఉంది. అది స్కేటింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద వాటర్ ఉంటాయి. అది వెంటనే స్కేటింగ్ బోర్డు దిగి నెమ్మదిగా దానిని ముందు తోసి మళ్లీ దాని మీద ఎక్కుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పటికే ఆరు మిలియన్ల మందికి పైగా చూశారు. లక్ష వరకు లైక్ చేశారు. మరో వైపు ఈ వీడియో చూసిన వారు కుక్కలు ఏవైనా నేర్చుకోగలవు అంటూ కామెంట్ పెడుతున్నారు.
If you gotta go you gotta go.. 😂 pic.twitter.com/zo5RpuSP58
— Buitengebieden (@buitengebieden) September 3, 2023