NTV Telugu Site icon

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీకి 15 మంది వైద్యులు ఎన్నిక

Doctors

Doctors

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్‌ ఆశలు ఆవిరైపోయాయి. ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీకి 15 మంది వైద్యులు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అందులో 11 మంది వైద్యులు కాంగ్రెస్ నుంచే ఎన్నిక కావడం గమనార్హం. డా. పాల్వాయి హరీష్ బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. కోరుట్ల, భద్రాచలం, జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ నుంచి డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

Read Also: Telangana Election Results: కరీంనగర్ అసెంబ్లీ ఫలితంపై హైడ్రామా.. రీకౌంటింగ్ కోరిన బండి సంజయ్!

ప్రజలకు వైద్యమే కాదు.. సమాజంలో ఉన్న రోగాలకు కూడా వైద్యం చేస్తామంటూ ప్రజల్లోకి వెళ్లిన వైద్యులు విజయం సాధించి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. డోర్నకల్‌ నియోజకవర్గంలో వైద్యుడిగా పని చేసిన రామచంద్ర నాయక్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. రామచంద్ర నాయక్‌ ఎంఎస్ జనరల్‌ సర్జన్‌ కావడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రెడ్యానాయక్‌పై ఆయన విజయం సాధించారు. అచ్చంపేటలో డా.వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజ్‌పై గెలుపొందారు. డా.వంశీకృష్ణ ఎంఎస్ జనరల్‌ సర్జన్‌ కావడం విశేషం. మరికొందరు డాక్టర్లు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు.
డాక్టర్లే ఎమ్మెల్యేలు అయ్యారు..

1)డా. రామచంద్ర నాయక్‌, ఎంఎస్ జనరల్‌ సర్జన్‌ , డోర్నకల్, కాంగ్రెస్

2)డా. వంశీకృష్ణ, ఎంఎస్ జనరల్‌ సర్జన్‌ , అచ్చంపేట, కాంగ్రెస్

3)డా.పాల్వాయి హరీష్, ఎంఎస్ ఆర్థో, సిర్పూర్, బీజేపీ

4)డా.మురళినాయక్, ఎంఎస్ జనరల్‌ సర్జన్‌, మహబూబాబాద్, కాంగ్రెస్

5)డా.సత్యనారాయణ, ఎంఎస్ జనరల్‌ సర్జన్‌, మానకొండూరు, కాంగ్రెస్

6)డా. మైనంపల్లి రోహిత్, ఎంబీబీఎస్, మెదక్, కాంగ్రెస్

7) డా.పర్ణికా రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్‌, నారాయణపేట్‌, కాంగ్రెస్‌

8)డా. సంజీవ రెడ్డి, పీడియాట్రిక్‌ వైద్యులు, నారాయణ్‌ఖేడ్, కాంగ్రెస్.

9) డా.వివేక్‌ వెంకటస్వామి, ఎంబీబీఎస్, చెన్నూర్, కాంగ్రెస్

10) డా.తెల్లం వెంకట్‌రావు, ఎంఎస్ ఆర్థో,  భద్రాచలం, బీఆర్‌ఎస్

11) డా.సంజయ్ కుమార్, ఎంఎస్ ఆప్తమాలజీ,  జగిత్యాల, బీఆర్‌ఎస్.

12) డా. కల్వకుంట్ల  సంజయ్, ఎంసీహెచ్‌ న్యూరో,  కోరుట్ల, బీఆర్‌ఎస్

13)డా. భూపతి రెడ్డి, ఎంఎస్ ఆర్థో, నిజామాబాద్ రూరల్, కాంగ్రెస్

14) డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎండీఎస్, నాగర్‌కర్నూల్, కాంగ్రెస్

15) డా. రాగమయి, ఎండీ పల్మనాలజిస్ట్, సత్తుపల్లి, కాంగ్రెస్