OYO Room: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఓ డాక్టర్ డేటింగ్ యాప్ ద్వారా మోసానికి గురయ్యారు. గ్రీండర్ (Grindr) అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు వైద్యుడిపై అఘాయిత్యం చేసి, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే..
Minors R*pe: దారుణం.. ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకుల అత్యాచారం
సదరు డాక్టర్ మరో యువకుడితో డేటింగ్ యాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకుని, మాదాపూర్‌లోని ఓయో రూమ్‌లో కలుసుకున్నారు. అయితే, కలుసుకున్న తర్వాత ఆ యువకుడు వైద్యుడిపై అఘాయిత్యానికి పాల్పడటానికి ప్రయత్నించగా.. దానికి డాక్టర్ దానిని ప్రతిఘటించారు. దీంతో కోపంతో ఆ యువకుడు డాక్టర్ పై దాడి చేశాడు. ఆ తర్వాత, ఆ యువకుడు డాక్టర్‌ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు.
Jailer 2 : జైలర్ 2 రిలీజ్ డేట్ చెప్పేసిన సూపర్ స్టార్ రజనీ
తాము ప్రైవేట్‌గా కలుసుకున్న విషయాన్ని ఇంట్లో చెబుతానని బెదిరించాడు. భయపడిన డాక్టర్ వెంటనే అతనికి రూ.5,000 చెల్లించారు. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఆ యువకుడు డాక్టర్‌ను వదలకుండా ఆసుపత్రి వరకు వెంటపడ్డాడు. డాక్టర్ పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్లి.. అక్కడ రచ్చ.. రచ్చ.. చేసి మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో చేసేది లేక బాధితుడైన డాక్టర్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. డేటింగ్ యాప్‌ల ద్వారా జరిగే ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.