70 ప్లస్ ఇయర్స్‌లో కూడా అదే జోష్, అదే స్వాగ్‌తో వర్క్ చేస్తున్నారు రజినీకాంత్. కూలీ థియేట్రికల్ రన్ ముగిసిందో లేదో జైలర్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. జైలర్ సీక్వెల్‌గా వస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్లీ కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. తలైవాను చూసేందుకు బారులు తీరారు అక్కడి జనాలు. అక్కడ ప్యాకప్ చెప్పి చెన్నైలో దిగిపోయిన రజనీని మీడియా కొన్ని ప్రశ్నలు వేయగా టపీ టపీమని సమాధానం చెప్పేసిన తలైవా జైలర్ 2 రిలీజ్ డేట్ రివీల్ చేశారు.
Also Read : OG Review : ఓజీ ఓవర్సీస్ రివ్యూ.. ఏంటి గురూ ఇలా ఉంది
జైలర్ 2 షూటింగ్ బాగా జరుగుతుందన్న రజనీకాంత్.. సినిమా ఎప్పుడు రిలీజ్ అన్న ప్రశ్నకు జూన్ 12 అని సమాధానం ఇచ్చారు. అంటే నెక్ట్స్ ఇయర్ జూన్ బరిలో బొమ్మ రిలీజ్ కాబోతుందన్నమాట. ఈ సినిమా విషయంలోనే కాదు.. గతంలో కూడా కమల్‌తో మల్టీస్టారర్ ఫిల్మ్ గురించి ప్రశ్నిస్తే.. మంచి కథ, డైరెక్టర్ దొరికితే మూవీ చేయడానికి రెడీ అంటూ సమాధానమిచ్చారు. దీంతో కమల్- రజనీని లోకేశ్ కనగరాజ్ డీల్ చేయడం లేదన్న క్లారిటీ వచ్చేసింది. కానీ లోకీతోనే మూవీ ఉండబోతుందని లెటెస్ట్ టాక్. జైలర్ 2 షూటింగ్ విషయానికి వస్తే… ఇప్పటి వరకు ఫైవ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. ఇక ఫైనల్ షెడ్యూల్‌ను గోవాలో ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. డిసెంబర్ లేదా నెక్ట్స్ ఇయర్ జనవరిలో షూటింగ్ కంప్లీట్ చేసి.. 5 మంత్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద కాన్సట్రేషన్ చేయనున్నాడని తెలుస్తోంది. కూలీతో లోకీపై నమ్మకాన్ని పోగొట్టుకున్న రజనీకి నెల్సన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో..? జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రాజెక్టుపై హైప్ తెచ్చుకుంటాడో లేదో నెల్సన్.