ఆఫిస్ లో ఉన్నప్పుడు, ముఖ్యమైన పని ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా.. ఆపుకొంటుంటాం. కానీ అలా చేస్తే.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆడవారు బయటకు వెళ్లినప్పుడు టాయిలెట్స్ అందుబాటులో లేనప్పుడు చాలా సేపు ఆపుకుంటూ ఉంటారు. అయితే దీని వల్ల ఎన్నో ఆనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి వయసును బట్టి మూత్రాన్ని కొంతసేపటి వరకు ఆపుకోవచ్చని వైద్యులు అంటున్నారు. సాధారణంగా చిన్న పిల్లలు అంటే 10 సంవత్సరాల లోపు వారు మూత్రాన్ని గంట వరకు ఆపుకోగలరు.. అదే 10 సంవత్సరాలు దాటిన వారు దాదాపు రెండు గంటల వరకు మూత్రాన్ని ఆపుకున్నా పెద్ద ఇబ్బంది పడరు.
READ MORE: Pavithra Ex Husband: దర్శన్ భార్య విజయలక్ష్మిపై పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్ ఫిర్యాదు?
30 సంవత్సరాలు దాటిన వారు మూడు నుంచి 5 గంటల వరకు మూత్రాన్ని ఆపుకోగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీని కారణంగా మీ మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి. అంతేకాదు ఎక్కువ సేపు ఇలా ఆపుకుంటూ పోతే.. మూత్రాన్ని ఆపుకునే సామర్థ్యం క్రమంగా తగ్గుతూ పోతుంది. అలాగే మూత్రం లీక్ అయ్యే ప్రమాదం కూడా కలిగిస్తుంది. మూత్రాన్ని ఎక్కువసేపు బిగపట్టుకోవడం వల్ల మీకు కటి నొప్పి వచ్చే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య కటి తిమ్మిరిగా కూడా మరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరు మూత్రాశయాన్ని ప్రతి కొన్ని నిమిషాలకోసారి ఖాళీ చేయాలి. ఇది యూటీఐ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది.
READ MORE: Pavithra Ex Husband: దర్శన్ భార్య విజయలక్ష్మిపై పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్ ఫిర్యాదు?
మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మీ మూత్రాశయం సాగిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆ తర్వాత మూత్ర విసర్జన చేయడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. దీనితోపాటు మీకు ఇంతక ముందు ఎప్పుడైనా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే.. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మళ్లీ ఏర్పడతాయి. అందుకే ఎక్కువ సమయం మూత్రం ఆపుకొనేందుకు యత్నించకూడదని వైద్యులు చెబుతున్నారు.