టాలీవుడ్ నటి ఆషిక రంగనాథ్ ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఆమె మేనమామ కూతురు అచల్ (22) నవంబర్ 22న ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగానికి రెడీ అవుతున్న అచల్, తన దూరపు బంధువు మయాంక్ తో ప్రేమలో ఉండేది. అయితే, మయాంక్ చేసిన మోసం ఆమెను తీవ్ర విషాదంలోకి నెట్టిందని కుటుంబం ఆరోపిస్తోంది. మయాంక్, అచల్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అప్పటి వరకు శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడట. అచల్ అంగీకరించనప్పుడు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. అంతేకాదు అతనికి వేరే అమ్మయిలతో కూడా అనైతిక సంబంధాలు ఉన్నాయనే విషయం అచల్‌కి తెలిసి తీవ్రంగా కుంగిపోయిందట.
Also Read : Dil Raju : బాలీవుడ్ నుండి ఏకంగా 6 సినిమాలతో రాబోతున్న దిల్‌రాజు..
దీంతో మనోవేదనకు గురైన అచల్, చివరికి బంధువుల ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నువ్వు లేక నేను బ్రతకలేను..నా జీవితంలో నువ్వు లేకుండా నేను జీవించలేను..నువ్వు నన్ను మోసం చేసినా కూడా నిన్ను మర్చిపోలేను..నా కలలను నువ్వే చెడగొట్టావు..నువ్వు చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోవాలి..నా నంబర్‌ను బ్లాక్ చేయొద్దు’ అంటూ ఆత్మహత్యకు కొన్ని క్షణాల ముందు అచల్, మయాంక్‌కు పంపిన మెసేజ్ కుటుంబ సభ్యుల హృదయాలను మరింత ముక్కలు చేసింది.
అయితే ఈ ఘటన జరిగిన 10 రోజులు గడిచినా, పోలీసులు ఇంకా చర్యలు తీసుకోకపోవడం పట్ల అచల్ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మయాంక్‌తో పాటు అతని తల్లి మైనా పై కూడా పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ లో అధికారిక ఫిర్యాదు చేశారు. “నిందితులను వెంటనే అరెస్ట్ చేసి మా కుమార్తెకు న్యాయం చేయాలి” అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో నటి ఆషికా రంగనాథ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దీంతో కుటుంబాన్ని కుదిపేసిన ఈ ఘటన, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, యువతిపై పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లను మరోసారి వెలుగులోకి తెచ్చింది.