Site icon NTV Telugu

Katchatheevu: కచ్చతీవు ద్వీపంపై రాజకీయ రగడ.. కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం

Katchavuu

Katchavuu

Katchatheevu: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు ద్వీపం అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. 1974లో ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారని కమలం పార్టీ ఆరోపించింది. ఇక, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ ర్యాలీలోనూ కచ్చతీవును మోడీ ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలపై ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉండగా.. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతా పరంగా కీలకమైందన్నారు. కానీ, కాంగ్రెస్‌ ఆ ద్వీపం ఎందుకూ పనికిరాదంటూ శ్రీలంకకు అప్పగించిందని ఆరోపించారు. అలాగే, తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్లినపుడు శ్రీలంక అధికారులు అరెస్టు చేస్తున్నారని తెలిపారు.. ఇక, తమ బోట్లను జప్తు చేస్తున్నారు.. కాంగ్రెస్‌తో పొత్తుకట్టిన డీఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై మాట్లాడటం లేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

Read Also: Congress: సీఈసీ ముందు ప్రతిపాదనలు.. నేడు ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా..!

ఇక, ప్రధాని మోడీ ఆరోపణలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ అయ్యారు. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలోనే ఈ సున్నిత అంశాన్ని ప్రధాని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కచ్చతీవును ఎందుకు వెనక్కి తెచ్చుకోలేదు మోడీ ప్రభుత్వం అని ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో 20 మంది సైనికులు ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత కూడా.. చైనాకు మోడీ ఎలా క్లీన్‌చిట్‌ ఇచ్చారని ఖర్గే నిలదీశారు. ఇక, మీ హయాంలో బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు ఒప్పందం చేసుకున్నారు.. స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా 55 ప్రాంతాలు భారత్‌కు వస్తే.. 111 ప్రాంతాలు బంగ్లాకు వెళ్లాయనే విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఒప్పందంలో భాగంగానే గత ప్రభుత్వం శ్రీలంకకు కచ్చతీవు దీవిని అప్పగించిందని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

Read Also: Premalu OTT: ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..స్ట్రీమింగ్ అప్పుడే?

ఇక, 1974లో కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు డీఎంకే పార్టీ నేతలు ఎదురుదాడి చేసింది. బీజేపీ ప్రతిపక్షాలపై నిందలు వేయడంలో నిమగ్నమైందని ఆ పార్టీ మండిపడింది. బీజేపీ ఈ పదేళ్లలో సాధించిన విజయాలను ప్రచారం చేసుకోలేక.. ఈలాంటి సున్నితమైన అంశాలతో రాజకీయం చేయాలని అనుకుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడం బీజేపీకి సిగ్గుమాలిన చర్య అని డీఎంకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Exit mobile version