మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు సినిమా తెలుగులో కూడా భారీ సక్సెస్ ను అందుకుంది.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది..యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది.. హైదరాబాద్ లో ఎలా జరుగుతున్నాయి, యూత్ లవ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో సూపర్ సక్సెస్ అందుకుంది.. ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేయడం విశేషం. గిరీష్ ఏడీ తెరకెక్కించిన ప్రేమలు లో స్లీన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు.
ఇక కేవలం 10 కోట్లతో తెరకకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం.. థియేటర్లలో ఆడియన్స్ కు ఆకట్టుకున్న ఈ సినిమా ఓటిటిలోకి రాబోతుంది.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేమలు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.. గతంలో ఎన్నోసార్లు ఈ సినిమా విడుదల పై పూకార్లు వినిపించిన వాటిని కొట్టి పడేసింది ప్రేమలు టీమ్.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.. ఏప్రిల్ 12 న ఓటీటిలోకి రాబోతుంది..
త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికార ప్రకటన రాబోతుంది.. భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫాహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా ఈ ను నిర్మించారు. మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీం తదితరులు ఈ సినిమాలో నటించారు.. అక్కడ సూపర్ హిట్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..