DK Shivakumar: గవర్నర్‌ను కలిసిన డీకే.శివకుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!
- గవర్నర్‌ను కలిసిన డీకే.శివకుమార్
- కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు
- కాసేపట్లో శాసనసభాపక్ష నేతగా డీకేను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే.శివకుమార్ లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తదుపరి కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు. ఇక సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశం కానున్నారు. ఈ భేటీలో శాసనసభా పక్ష నేతగా డీకే.శివకుమార్‌ను ఎన్నుకోనున్నారు. ఇక జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆరోజు మంచి ముహూర్తం కావడం.. అదేరోజు రాహుల్ గాంధీతో పాటు కీలక నేతలంతా అందుబాటులో ఉండడంతో ఆ సమయాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇక భవిష్యత్ ప్లాన్‌లో భాగంగా భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ప్రణాళిక రచించినట్లుగా తెలుస్తోంది. పలువురు సీనియర్ నాయకులు ప్రభుత్వంలో తరాల మార్పును సమర్థిస్తున్నారు. సలీం అహ్మద్, ఎం. వీరప్ప మొయిలీ సహా పార్టీ నాయకులు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఊపు తెచ్చేందుకు మంత్రివర్గంలోని దాదాపు సగం పదవులను కొత్త ముఖాలకు ఇవ్వాలని సూచించారు. కర్ణాటక వ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు.. పదవిలో మూడేళ్లు పూర్తి చేసుకున్న మంత్రులను సంస్థాగత పాత్రలకు బదిలీ చేసే చారిత్రాత్మక కామరాజ్ ప్రణాళికను నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Delhi attack plan: అణు కేంద్రాలు, ఎయిర్‌పోర్టులే టార్గెట్.. దావూద్-ఐఎస్ఐ కుట్ర భగ్నం..
- Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వంలో తన వారికి రెండు డిప్యూటీ సీఎం పోస్ట్‌లతో పాటు కీలక పదవులు అప్పగించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దగ్గర డిమాండ్ పెట్టినట్లుగా సమాచారం. ఇక రాష్ట్ర నాయకత్వంలోనే కొనసాగుతానని సిద్ధరామయ్య తేల్చిచెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
DK Shivakumar: గవర్నర్‌ను కలిసిన డీకే.శివకుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!
-
Delhi attack plan: అణు కేంద్రాలు, ఎయిర్‌పోర్టులే టార్గెట్.. దావూద్-ఐఎస్ఐ కుట్ర భగ్నం..
-
SSY: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం వారికి వరం.. రూ.50 లక్షలు పొందొచ్చు!
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ.22 తగ్గించిన పాక్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..