DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం
- రేపు బెంగళూరులో కీలక సమావేశం ఉంది
- ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. గురువారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం.. సాయంత్రం గవర్నర్ ఆమోదించడం కూడా జరిగి పోయింది. ఇక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఢిల్లీలో ఉన్న డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా జాగ్రత్తగా.. ఆచితూచి స్పందించారు.
కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయలేమని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నాయకుడిని ఇంకా అధికారికంగా ఎన్నుకోలేదు. ఆ నిర్ణయం పూర్తిగా లెజిస్లేటర్ల ద్వారా ఫార్మలైజ్ అయ్యే వరకు ప్రమాణస్వీకారం ఎప్పుడు జరుగుతుందో ఎలా చెప్పగలను?” అని శివకుమార్ వ్యాఖ్యానించారు. శనివారం జరగనున్న CLP సమావేశానికి ముందుగా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి.
Also Read
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
రేపు కేంద్ర నాయకత్వం సీఎల్పీ సమావేశానికి హాజరుకానుందని… కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు రావాలని ఆదేశించినట్లు తెలిపారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటే కాకుండా కర్ణాటకలో పార్టీ సంస్థాగత నియామకాలు, రాజ్యసభ సీట్ల పంపకంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని… రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను రాష్ట్రాల వారీగా కాకుండా జాతీయ స్థాయిలో ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందని శివకుమార్ వెల్లడించారు. కీలకమైన శాసన ప్రక్రియలు, అధికారిక లాంఛనాలు పూర్తైన తర్వాతే ఏ నిర్ణయమైనా ప్రకటించగలమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాన దృష్టి లెజిస్లేచర్ పార్టీ నాయకత్వ ఎన్నికపైనే ఉందని తేల్చి చెప్పారు.
మరోవైపు సిద్దరామయ్య తన కుమారుడు యతీంద్రను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం. అలాగే కేఎస్ జార్జ్, జీ పరమేశ్వరను కేబినెట్లో కొనసాగించాలని కూడా సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తుది చర్చలు జరుపుతోంది.
తాజావార్తలు
-
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్‌దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
-
Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్..
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..