IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Jyotirlinga Darshan Yatra: శివనామ స్మరణతో పునీతమవ్వాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం “సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర” పేరుతో ఒక అద్భుతమైన డివైన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో కేవలం ఒకే ఒక్క ప్రయాణంలో ఏకంగా ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సువర్ణావకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక యాత్ర కోసం ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ సర్వీసును ఉపయోగించనున్నారు. జూన్ 16న తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ తన జర్నీని స్టార్ట్ చేయనుంది.
11 రోజుల సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణం..
ఈ డివైన్ టూర్ ప్యాకేజీ మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ రైలు రూట్‌ను డిజైన్ చేశారు. కేవలం సికింద్రాబాద్‌లోనే కాకుండా, ప్రయాణికుల డిమాండ్ మేరకు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్లలో కూడా ఈ రైలు ఎక్కే సదుపాయాన్ని కల్పించారు. దీంతో ఉత్తర తెలంగాణ భక్తులకు ఈ యాత్ర చాలా ఈజీగా మారనుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి మూడు కీలక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలను ఈ టూర్లో కవర్ చేయనున్నారు.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
ఒకే యాత్రలో దర్శించే సప్త జ్యోతిర్లింగాలు ఇవే
భక్తులు ఎంతో కాలంగా కలలుగనే ప్రముఖ శివాలయాలన్నీ ఈ సింగిల్ టూర్లో దర్శించుకోవచ్చు. ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం సందర్శించే ప్రధాన క్షేత్రాల జాబితా ఇదే..
మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం: ఉజ్జయిని (మధ్యప్రదేశ్) – ఇక్కడి భస్మ హారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం: నర్మదా నది తీరాన వెలిసిన పవిత్ర క్షేత్రం (మధ్యప్రదేశ్).
నాగేశ్వర్ జ్యోతిర్లింగం & ద్వారకాధీశ్ ఆలయం: శ్రీకృష్ణుడి లీలా క్షేత్రమైన ద్వారకతో పాటు దాని సమీపంలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం (గుజరాత్).
సోమనాథ్ జ్యోతిర్లింగం: దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మొదటి జ్యోతిర్లింగ క్షేత్రం (గుజరాత్).
భీమశంకర్ జ్యోతిర్లింగం: ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన శివాలయం (మహారాష్ట్ర).
త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం: గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ సమీపంలోని క్షేత్రం (మహారాష్ట్ర).
ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగం: ఎల్లోరా గుహల చెంతన కొలువైన చివరి జ్యోతిర్లింగం (ఛత్రపతి శంభాజీనగర్, మహారాష్ట్ర).
ప్రయాణం సాగేది ఇలా..
యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అయి నేరుగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడ మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నాక, ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత రైలు గుజరాత్ వైపు పరుగులు తీస్తుంది. అక్కడ ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాల డివైన్ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృశ్నేశ్వర్ క్షేత్రాలను సందర్శిస్తారు. ఈ ఏడు క్షేత్రాల దర్శనం పూర్తయ్యాక తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ టికెట్ ధరలు (కేటగిరీల వారీగా):
సాధారణ భక్తుడి నుంచి లగ్జరీగా ప్రయాణించాలనుకునే వారి వరకు అందరికీ అందుబాటులో ఉండేలా ఐఆర్సీటీసీ మూడు కేటగిరీల్లో ధరలను నిర్ణయించింది. వాటి వివరాలు ఇవే.. ఎకానమీ క్లాస్ (Sleeper) పెద్దలకు రూ.17,600 కాగా, పిల్లలకు రూ.16,300 నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ (3AC) విషయానికి వస్తే ఇందులో పెద్దలకు రూ.26,700 కాగా, పిల్లలకు రూ.25,200 గా నిర్ణయించారు. చివరగా కంఫర్ట్ క్లాస్ (2AC) విషయానికి వస్తే ఇందులో పెద్దలకు రూ.34,600 కాగా, పిల్లలకు రూ.32,800 గా టికెట్ ధరలను ఫైనల్ చేశారు.
ఈ ప్యాకేజీలో లభించే ఉచిత సదుపాయాలు ఇవే
ఈ ప్యాకేజీ ధరలోనే భక్తులకు ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి ప్యూర్ వెజిటేరియన్ భోజనం అందిస్తారు. దీంతో పాటు హోటల్ వసతి, లోకల్ సైట్ సీయింగ్ కోసం బస్సు సౌకర్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్/టూర్ మేనేజర్ల సేవలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. (గమనిక: ఆలయాల్లో ఉండే అదనపు ప్రత్యేక దర్శన టికెట్లు, పర్సనల్ ఖర్చులు మాత్రం భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది). తక్కువ బడ్జెట్లో, ఎలాంటి ప్లానింగ్ టెన్షన్ లేకుండా దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను చుట్టి రావాలనుకునే వారికి ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన ఈ భారత్ గౌరవ్ టూర్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!