Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- భార్య, అత్తింటి వేధింపులపై సూరత్ వ్యక్తి ఫిర్యాదు.
- న్యాయం లేకపోతే కారుణ్య మరణం ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి.
- విడాకుల పేరుతో డబ్బులు డిమాండ్ చేశారంటూ ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Harassment: భార్య వేధింపులు భరించలేక ఒక భర్త కారుణ్య మరణాన్ని కోరుతూ అధికారుల్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. తన భార్య, అత్తింటి వారు, బావమరిది వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, వారికి శిక్ష విధించలేకపోతే తనకు మరణించే అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. బాబుభాయ్ పటేల్ అనే వ్యక్తి తన భార్య మోనికా చౌహాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె కుటుంబం తనను తప్పుడు కేసుల్లో ఇరికించి మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. తనకు మూడు రోజుల్లో న్యాయం చేయకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించారు.
తనకు మొదటి వివాహం ద్వారా పుట్టిన 12 ఏళ్ల కుమారుడిని తన భార్య హత్య చేయడానికి ప్రయత్నించిందని పటేల్ ఆరోపించారు. గొంతు నులిమి చంపేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. తన కుమారుడికి కౌన్సిలింగ్ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. విడాకుల పేరుతో తన భార్య, ఆమె కుటుంబం డబ్బులు వసూలు చేయడానికి ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు.
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
అయితే, ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించారు. భార్యభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు అనేక ప్రయత్నాలు చేశామని తెలిపారు. అయితే వివాదం పరిష్కారం కాకపోవడంతో భార్య తన పుట్టింటికి వెళ్లినట్లు చెప్పారు. ఆ తర్వాత భర్తపై గృహహింసతో పాటు అనేక కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. భార్య తన మెయింటనెన్స్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కుమారుడిపై హత్యాయత్నానికి సంబంధించిన ఆధారాలు లభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!