IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌తో బెంగళూరు నగరం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT), రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు రాత్రి (మే 31, ఆదివారం) మహా సంగ్రామం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్ వచ్చింది. ఆర్సీబీ జట్టు తమ రెండో ఐపీఎల్ టైటిల్‌పై కన్నేసిన నేపథ్యంలో.. మ్యాచ్ ముగిసిన తర్వాత నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరు పోలీసులు అత్యంత కఠినమైన ట్రాఫిక్, భద్రతా మార్గదర్శకాలను (Advisory) జారీ చేశారు. మ్యాచ్ అనంతరం రోడ్లపైకి వచ్చి వేడుకలు చేసుకోవడం, బాణాసంచా కాల్చడం, బైక్ ర్యాలీలు తీయడం, గొడవలకు దిగడం వంటి పనులకు దూరంగా ఉండాలని ప్రజలను పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి బలమైన కారణమే ఉంది. గత ఏడాది (2025) జూన్ 4వ తేదీన ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన సమయంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ ఎత్తున సంబరాలు జరిగాయి. ఆ సమయంలో అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి విషాదకర సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈసారి పోలీసులు ముందస్తుగా ఈ ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి పబ్లిక్ సెలబ్రేషన్స్ లేదా బైక్ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ అడ్వైజరీ ప్రకారం.. బహిరంగ ప్రదేశాలలో పెద్ద ఎల్ఈడీ (LED) స్క్రీన్లపై మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయడంపై పూర్తి నిషేధం విధించారు. మాల్స్, పబ్‌లు లేదా ఇతర వ్యాపార సంస్థల వెలుపల సాధారణ ప్రజలకు కనిపించేలా స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదు. ముఖ్యంగా రోడ్ల వైపు ముఖం ఉన్న ఎల్ఈడీ గోడలపై మ్యాచ్‌ను ప్రసారం చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. మ్యాచ్ ముగిసిన తర్వాత రోడ్లపై వేగంగా బైక్‌లు నడపడం, స్టంట్లు చేయడం, అనవసరంగా హారన్లు కొట్టడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, బాణాసంచా కాల్చడం వంటి పనులను పూర్తిగా నిషేధించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో శాంతి, క్రమశిక్షణను పాటించాలని పోలీసులు కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసభ్యంగా ప్రవర్తించడం, వేడుకల నెపంతో హింసకు దిగడం వంటివి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మ్యాచ్ ఫలితాన్ని బట్టి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, ద్వేషపూరిత సందేశాలు పంపడం, పుకార్లు వ్యాప్తి చేయడం వంటివి చేయవద్దని పోలీసులు సూచించారు. మ్యాచ్ గెలిచినా లేదా ఓడినా.. ప్రత్యర్థి జట్ల అభిమానులను కించపరచడం, గేలి చేయడం లేదా వారిని గొడవల్లోకి లాగడం వంటి పనులకు ఫ్యాన్స్ దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడటం అనేది అందరి సామూహిక బాధ్యతని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని బెంగళూరు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!