DK Aruna: రాజకీయాలకు ప్రజాస్వామ్యం బలవుతోంది! కాంగ్రెస్–బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు మళ్లీ బయటపడ్డాయి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆమె అనేక అంశాలపై తనదైన శైలిలో వివరించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ – కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ‘హైడ్ అండ్ సీక్’ రాజకీయ నాటకం కొనసాగుతోందని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారన్నారు. తనతో పాటు తన కుటుంబం ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారని మాట్లాడారని.. కానీ, ఇప్పుడు ఆయన అవన్నీ మరిచినట్టుగా, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే తనకు నోటీసులు వచ్చేవి కదా అనే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
అలాంటప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నాటకమా..? లేక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కుదిరిన ప్యాకేజీ డీలే కారణమా..? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య ప్యాకేజీ బేరాలు కుదిరాయనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు ప్రజల ముందు కేవలం మాటల యుద్ధం చేసుకుంటూ కుమ్ములాటలు చేసుకుంటూ, చీకట్లో ప్యాకేజీలు కుదుర్చుకుంటున్న విషయం మరోసారి స్పష్టమైందన్నారు.
Also Read
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- Tejashwi Yadav: బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
Mahesh Kumar Goud: తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది చేసింది.. కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది..!
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై ఇప్పటికే కేంద్ర వ్యవస్థలు సంచలన విషయాలను బయటపెట్టాయన్నారు. ఈ విషయంలో నాడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి.. అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ పార్టీకి రక్షణ కవచంగా మారారన్నారు. రూ. 38,000 కోట్లతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ. 1.2 లక్షల కోట్లకు పెంచిన సంగతి తెలిసిందేనని.. వేల కోట్లు వృథా చేసినట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలు స్పష్టంగా పేర్కొన్నాయి.
ఈ ప్రాజెక్టులో టెండర్ల మంజూరు, పునర్నిర్మాణ ఖర్చులు, నిర్మాణ వైఫల్యాలపై సంపూర్ణ విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అడుగైనా ముందుకు వేయకుండా, ఈ కేసును నీరుగార్చే కుట్రలకే పాల్పడుతోందన్నారు. గత 19 నెలలుగా కాళేశ్వరం అవినీతి దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తూ.. అసలు దోషులను అరెస్ట్ చేయకుండా విమర్శలకే పరిమితమైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో సీబీఐ విచారణకు కోరి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.
Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 50 మంది దుర్మరణం
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మాత్రమే కాదు.. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులు, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, ఫార్ములా ఈ రేసింగ్ కేసులో నిధుల మళ్లింపు, ల్యాండ్ స్కాంలు, ఉద్యోగ నియామకాలలో చోటుచేసుకున్న అవకతవకలు.. ఈ కేసులన్నింటిపై విచారణ చేపడతామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు దోషులను పట్టుకున్న పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబంతో కుమ్మక్కై అవినీతికి కవచంగా మారిందని తెలిపారు.
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!