DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆమె అనేక అంశాలపై తనదైన శైలిలో వివరించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ – కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ‘హైడ్ అండ్ సీక్’ రాజకీయ నాటకం కొనసాగుతోందని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనలపై రేవంత్ రెడ్డి…
ఢిల్లీ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీకి వెళ్లడం నేరంగా మాట్లాడుతున్నారు.. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతోనే మాట్లాడాలన్నారు. ఢిల్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి.. ఫామ్ హౌస్ కి వెళ్ళాలా? అని ఫైర్ అయ్యారు. 33, 34 సార్లు ఢిల్లీకి వచ్చానని.. 48 సార్లు వచ్చానని మాట్లాడుతున్నారన్నారు. తన ప్రియారిటి రాష్ట్రమని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ , వివాదాలను పరిష్కరించుకోవడం ముఖ్యమన్నారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కంటే సమర్థవంతంగా పని చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్…
NVSS Prabhakar : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య ఓ రహస్య రాజకీయ డీల్ కుదిరిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనానికి గ్రౌండ్ వర్క్ మొదలైపోయిందని, ఇప్పటికే రెండుపార్టీల కీలక నేతల మధ్య రాజీ కుదిరిందని అన్నారు. ఈ డీల్‌లో భాగంగానే కాలేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలపై…
Beerla Ilaiah : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేయడం తగదని, కనీసం గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించే సంస్కృతి కూడా బీఆర్‌ఎస్ నేతలకు లేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుగా అసెంబ్లీకి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వ విప్ సూచించారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్…