పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ హాజరయ్యారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.
READ MORE: Upcoming Smartphones: ఈ రెండు చౌకైన 5G ఫోన్‌లు వచ్చే వారం విడుదల.. కేక పుట్టించే ఫీచర్లు
“సీఎం చంద్రబాబుతో అనేక విషయాలు మాట్లాడాను. రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తాం. పొగాకు రైతుల సమస్యలపై చర్చించాం. ఎక్కువపొగాకు పండించడం వల్లే సమస్య వచ్చింది. పొగాకు సాగు తగ్గించాలని సూచించాం.రైతుల పిల్లలకు ఇచ్చే విద్యా రుణాలను చెల్లించే విషయంలో సడలింపులు ఇస్తున్నాం. నైపుణ్యాలు పెంచుకునేలా అనేక చర్యలు చేపట్టాం. వివిధ దేశాల భాషలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ది పైజరిగిన సమావేశం ఆశాజనకంగా ఉంది. పోర్ట్, పారిశ్రామిక అభివృద్గి ద్వారా రాష్ట్రంలో రూ.1.6 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతాయి. కొత్త ఉద్యోగ కల్పన జరుగుతాయి. గత నాల్గు ఏళ్ళలో పోగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగింది. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాం. పొగాకు రైతుల పిల్లలకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తాం.. జపనీస్, జర్మన్ , చైనా భాషలను నేర్పుతాం.” అని పీయూష్ గోయల్ వెల్లడించారు.
