పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ హాజరయ్యారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.
Minister Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేడు (జూన్ 15) అమరావతికి రానున్నారు. రాష్ట్రానికి రానున్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి లంచ్ మీట్లో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించనట్టు తెలుస్తోంది. ఇక లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతుల సమస్యలు, దిగుబడి ధరలు, మార్కెట్ పరిస్థితులు…
పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
పొగాకు రైతులు ధరలపై అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటికే పొగాకు ధరలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారన్నారు. రైతులు దగ్గర ఉన్న పొగాకు పంటను కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి కొనే విదంగా చూస్తామన్నారు. బాపట్ల జిల్లా టూరిజంకి ఆయువు పట్టు అని, టూరిజంతో జిల్లా జీడీపీ పెరుగుగుతుందన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ప్రారంభిస్తున్నాం అని మంత్రి చెప్పుకొచ్చారు. నేడు బాపట్ల జిల్లా…