SS Rajamouli participated in the Akkineni Nageswararao Centenary Celebrations: తెలుగు సినిమాపై చెరదని ముద్ర వేసిన దిగ్గజ నటుడు ‘అక్కినేని నాగేశ్వరరావు’ శత జయంతి వేడుకలు నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. ఏఎన్‌ఆర్ వందో పుట్టినరోజు సందర్భంగా ఆయన విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకలకు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి.. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు.. హీరోలు మహేశ్‌బాబు, రామ్‌చరణ్, రానా, మంచు విష్ణు, నాని.. సీనియర్ నటులు మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, మురళీ మోహన్, శ్రీకాంత్, జగపతి బాబు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్‌ఆర్ శత జయంతి సందర్భంగా తెలుగు నటీనటులు వేదికపై మాట్లాడారు. ఈ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ… దేవుడిపై నమ్మకం లేకున్నా.. భక్తిరస చిత్రాల్లో ఏఎన్‌ఆర్ అద్భుతంగా నటించారన్నారు.
Also Read: Crime News: ప్రేమించలేదని యువతికి పురుగుల మందు తాగించి హత్య
‘ఏఎన్నార్‌ను చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూశాను తప్ప.. వ్యక్తిగతంగా ఆయనతో పెద్దగా పరిచయం లేదు. ఓ ఫంక్షన్ వెళ్లినపుడు లేట్ అవ్వడంతో.. నాగేశ్వరరావు గారు, నేను ఒక రూంలో కూర్చున్నాం. తన ఇమేజ్ (దేవదాస్) మార్చుకొవడం కోసం మిస్సమ్మలో కమిడియన్‌గా చేశానని నాతో చెప్పారు. ఓ సూపర్ స్టార్ అయుండి మరో స్టార్ పక్కన కమిడియన్‌గా చేశారంటే.. ఆయనకు దండం పెట్టాల్సిందే. ఆయన అందరికీ ఒక ప్రేరణ. దేవుడిపై నమ్మకం లేకున్నా.. భక్తిరస చిత్రాల్లో అద్భుతంగా నటించారు. ఏఎన్నార్ పెద్ద లెజెండ్’ అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.