Krish Jagarlamudi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్-ఇండియా సినిమాగా వచ్చిన హరి హర వీర మల్లు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా కలెక్షన్లను రాబట్టలేక పోయింది. కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా కంటెంట్ కూడా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం రీచ్ కాలేదని టాక్. ఈ సినిమాకు మొదట దర్శకుడిగా ఉన్న క్రిష్ జాగర్లమూడి సినిమా మధ్యలో తప్పుకోవడంతో, తర్వాత సినిమా దర్శక బాధ్యతలు జ్యోతి కృష్ణకి చేపట్టిన సంగతి తెలిసిందే.
SSMB 29: ఇక పాన్ ఇండియా కాదయ్యా.. పాన్ వరల్డ్ అనాలేమో! ఏకంగా 120 దేశాలలో రిలీజ్?
అయితే, తాజాగా ఘాటి సినిమా ప్రమోషన్స్ సందర్భంగా దర్శకుడు క్రిష్ హరి హర వీర మల్లులోని కొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. ఆయన చెప్పినదాని ప్రకారం.. తాను తెరకెక్కించిన ఎక్కువ సన్నివేశాలు ఢిల్లీ దర్బార్ నేపథ్యంలోనే జరుగుతాయి. అందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఒక అద్భుతమైన సెట్ వేసి వాటిని తీశాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక ఛాండెలియర్‌పై జరిగే ఫైట్ సీక్వెన్స్ లో అద్భుతంగా యాక్ట్ చేశారు. కానీ, ఈ ఎపిసోడ్ కథ ఢిల్లీకి వెళ్లిన తర్వాత వస్తుంది. ఇందుకు సంబంధించి దాదాపు 40 నిమిషాల ఫుటేజ్ సెకండ్ పార్ట్ కోసం ఉంచామని తెలిపారు.
Kieron Pollard: 6,6,0,6,6,6,6,6 .. 8 బంతుల్లో 7 సిక్సర్లు.. మాజీ ఆల్‌రౌండర్ ఊచకోత!
అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా ఫైట్స్‌లో పాల్గొని అద్భుతంగా పని చేశారన్నారు. ఆయన ఔరంగజేబ్ దర్బార్‌కి వెళ్లి సూటిగా సవాల్ చేస్తారని, మొఘల్ చక్రవర్తి కోసం ప్రత్యేకంగా చేసిన సింహాసనంపై కూర్చొని, అక్కడి నుండి కోహినూర్ వజ్రం దొంగిలించే సన్నివేశం ఉందంటూ సినిమా విశేషాలను రివాల్వ్ చేశారు. ఇలాంటి ఎన్నో మంచి సన్నివేశాల ఫుటేజ్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉందని ఆయన అన్నారు. నేను పవన్ కళ్యాణ్ పై నా ప్రేమను ఈ సినిమాతో చూపించాను అని క్రిష్ వెల్లడించారు.