ఈజీగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఘరానా మోసం వెలుగుచూసింది. అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ. 20 కోట్లు కాజేశాడు ఓ ఘనుడు. అతడే మల్కాజిగిరి కి చెందిన దినేష్ పాణ్యం. వృద్ధులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్ గా భారీ మోసానికి తెరలేపాడు. ఆఖరికి రూ. 20 కోట్లు కాజేసి పరారయ్యాడు. పూర్తివివరాల్లోకి వెళ్తే.. దినేష్ పాణ్యం మల్కాజిగిరి అడ్డాగా ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతాను అని.. ప్రతీ నెలా బ్యాంకులు ఇచ్చే కంటే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించాడు. మనిషి ఆశాజీవి కదా.. దినేష్ చెప్పింది నమ్మి పలువురు పెట్టుబడి పెట్టారు.
Also Read:Terrorist Activity: ఉగ్రవాదులతో నూర్ మహమ్మద్‌కు ఉన్న లింకులపై పోలీసుల ఆరా..
దినేష్ తో రూ. 20 కోట్ల రూపాలకు పైగా పెట్టుబడి పెట్టారు 170 మంది. వారికి కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించాడు దినేష్. ఆ తర్వాత చెల్లించడం ఆపేశాడు. కొన్ని నెలలుగా వడ్డీ డబ్బులు అందకపోవడంతో బాధితులు అప్రమత్తమయ్యారు. దినేష్ ను నిలదీసేందుకు ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. కానీ, అప్పటికే బోర్డు తిప్పేసి పరార్ అయ్యాడు దినేష్ పాణ్యం. భార్య కవితను నిలదీయగా.. భర్తతో రెండు రోజుల క్రితమే విడిపోయాను అని, విడాకులకు అప్లై చేశాను అని చెప్పింది. బాధితులు చేసేదేం లేక కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.