Terrorist Activity: శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడు నూర్ మహమ్మద్ లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కొత్త ఇంటిని నూర్ నిర్మించుకున్నాడు. ఈ ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వచ్చిందని అనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు కోసం నూర్ మహమ్మద్ ను జ్యుడీషియల్ కస్టడీకి కోరే అవకాశం ఉంది. భార్య బిడ్డలకు దూరంగా ఉంటున్న నూర్ మహమ్మద్.. ఇటీవల తాడిపత్రికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Dear Students : ‘డియర్ స్టూడెంట్స్’తో మళ్లీ ట్రాక్‌లోకి నివిన్ పౌలీ..!
అయితే, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్కు ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు నూర్ మహమ్మద్ ను కదిరి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొనింది. దీంతో నూర్ మహమ్మద్ను కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. ఇక, నూర్ మహమ్మద్పై ఉపా యాక్ట్ తో పాటు దేశద్రోహం కేసు నమోదు చేసేశారు.