Miracle : ఇప్పటి దాకా మనం చాలా కవలల కథల గురించి చదివి ఉంటాం. చూసే ఉంటాం. మన చుట్టుపక్కల కూడా చాలా మంది కవలలు ఉండే ఉంటారు. వారు ఒకే సమయంలో జన్మించినప్పటికీ భిన్నంగా కనిపిస్తారు. ఈ కథనంలో పిల్లల కథ చాలా విచిత్రంగా ఉంది. విషయం తెలుసుకున్న జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది. మొదటి, రెండవ బిడ్డ పుట్టడానికి మధ్య 22 రోజుల వ్యత్యాసం ఉంది. మరి వాళ్లను కవలు అనొచ్చా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది.
Read Also:Kadiyam Srihari: అనుచరులతో కడియం భేటీ.. పార్టీ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ఇంగ్లిష్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇంగ్లండ్ నివాసి కైలీ డోయల్ కొన్ని నెలల క్రితం గర్భం దాల్చింది. ప్రాథమిక విచారణలోనే ఆమెకు కవల పిల్లలు పుట్టబోతున్నారని వైద్యులు తెలిపారు. ఇది విన్న కైలీ ఆనందంతో ఎగిరి గంతులు వేసింది…అయితే ప్రెగ్నెన్సీ సమయంలో 22 వారాల పాటు ఎలాంటి సమస్య ఎదురుకానప్పటికీ, ఒకరోజు ఆమెకు అకస్మాత్తుగా కడుపులో నొప్పి మొదలైంది. నొప్పి తీవ్రంగా ఉండడంతో మంచం మీద నుంచి లేవడం కూడా కష్టమైంది. అయితే, దీని తర్వాత కైలీని హడావుడిగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె సహజంగా 1.1 పౌండ్ల శిశువుకు జన్మనిచ్చింది. తాను చనిపోయింది.
Read Also:Priyanka Gandhi: దేశ ప్రజలను బీజేపీ అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది..
వైద్యుల ప్రకారం, ఆ చిన్నారి బొడ్డు తాడులో రక్తం గడ్డకట్టింది. దీని కారణంగా చనిపోయింది. రెండవ బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా పుడుతుందని కైలీకి పూర్తి ఆశ ఉంది కానీ అలాంటిదేమీ జరగలేదు. కొన్ని గంటల్లో ప్రసవ నొప్పి ఆగిపోయింది. దీంతో వైద్యులు ఆమెను ఇంటికి పంపించారు. అయితే ఈ ఘటన జరిగిన 22 రోజుల తర్వాత మళ్లీ నొప్పి రావడంతో వైద్యులకు సమాచారం అందించగా.. ఇద్దరు పిల్లల మధ్య ఇంత గ్యాప్ ఎలా వచ్చిందని వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. కైలీ పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే సి-సెక్షన్‌ను ఆశ్రయించారు. ఎందుకంటే వారు ఎక్కువసేపు వేచి ఉంటే, ఆమె మొదటి బిడ్డలాగే చనిపోయేది. డాక్టర్ ఈ దశ తర్వాత బిడ్డ జన్మించింది.