Site icon NTV Telugu

Hanuma Vihari: నన్నెందుకు జట్టు నుంచి తప్పించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు

Hanuma Vihari

Hanuma Vihari

టీమిండియా నుంచి నన్నెందుకు తప్పించారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని క్రికెటర్ హనుమ విహారి అన్నారు. టీమిండియాలో స్థానం లేనందుకు ఎంత నిరాశ చెందానో.. జట్టు నుంచి ఎందుకు తొలగించారు అనే కారణం తెలియక అంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నానని అతడు చెప్పాడు. ఈ విషయం గురించి మేనేజ్‌మెంట్‌ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు అతని పేర్కొన్నారు.

Read Also: Gujarat: ఆదర్శ భార్య.. 10 ఏళ్లలో 7 సార్లు భర్తను అరెస్ట్ చేయించి, తానే బెయిల్ ఇప్పించింది..

ప్రతి ఒక్కరి కెరీర్‌లో లోటుపాట్లు సహజం.. అయితే, ఇలాంటి చేదు అనుభవాలను జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని హనుమ విహారి అన్నారు. మొదట్లో చాలా బాధపడేవాడిని.. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి.. భారత జట్టులో నాకు చోటుందా లేదా అన్న విషయం గురించి ఎక్కువగా ఆందోళన పడటం లేదు.. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ట్రోఫీలు గెలిచే దిశగా ముందుకు సాగడమే నా తక్షణ కర్తవ్యం అని ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి అన్నాడు.

Read Also: Project K: ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ప్రాజెక్ట్ కె వాయిదా.. ?

అయితే, కాకినాడకు చెందిన హనుమ విహారి 2018లో టీమిండియా తరఫున జట్టులోకి అరంగేట్రం చేశాడు. లండన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హనుమ విహారి తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. 2022లో బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు తర్వాత హనుమ విహారికి మళ్లీ జాతీయ జట్టులో అవకాశం రాలేదు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ అతడికి ఛాన్స్ లు మాత్రం రావడం లేదు.

Read Also: BRO : సినిమాను సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న మేకర్స్..

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో అవకాశం వస్తుందని ఎదురుచూసిన హనుమ విహారికి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమ విహారీ మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉంటే.. దులిప్‌ ట్రోఫీ-2023లో సౌత్‌ జోన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విహారి జట్టును విజేతగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్ట్‌ జోన్‌తో ఆరంభమైన ఫైనల్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 టెస్టులాడిన విహారి 839 పరుగులు చేశాడు.. అతని అత్యధిక స్కోరు 111 పరుగులుగా ఉంది.

Exit mobile version