Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: పోలీసులు తనను కేవలం అదుపులోకి తీసుకోలేదని, ఏకంగా కిడ్నాప్ చేశారని ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఆరోపించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో తలపెట్టిన ‘జంతర్ మంతర్ 2.0’ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న క్రమంలో శనివారం (అక్టోబర్ 10న) గుర్గావ్లోని తన నివాసం నుంచి ఢిల్లీ పోలీసులు రాఠీని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసుల కస్టడీ నుంచి విడుదలైన తర్వాత ధ్రువ్ రాఠీ ఆదివారం తొలిసారి స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. “నేను నా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో నన్ను అపహరించడానికి గుండాలను పంపించారు” అని ఆరోపించారు.
ఈ వీడియోలో బీజేపీ తీరును తీవ్రంగా విమర్శించే రాఠీ.. తాను కస్టడీలో ఉన్న సమయంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, ఫాలోవర్లకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తన పౌరసత్వంపై సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ.. తన ఇండియన్ పాస్‌పోర్ట్‌ను కెమెరా ముందుకు తెచ్చి చూపించారు. “ఇదిగో నా పాస్‌పోర్ట్.. నేను భారత పౌరుడినే, ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటాను” అని స్పష్టం చేశారు. సీజేపీ ఆందోళనలో తాను పాల్గొనకుండా అడ్డుకోవడానికి, తన అరెస్టును సమర్థించుకోవడానికి కొందరు కావాలనే తనపై అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. తనకు విదేశీ పౌరసత్వం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని, ఒక సాధారణ భారతీయ పౌరుడిగా భారత్‌లో జరిగే నిరసనల్లో పాల్గొనే హక్కు తనకు పూర్తిస్థాయిలో ఉందని రాఠీ తేల్చి చెప్పారు.
Also Read
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
తనను అరెస్ట్ చేసిన విధానాన్ని వివరిస్తూ.. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తాను నిద్రపోతున్న సమయంలో దాదాపు 20 మంది సాదాసీదా దుస్తుల్లో వచ్చి తన ఇంట్లోకి ప్రవేశించారని చెప్పారు. వారు ఎవరో అడిగే లోపే తనను తీసుకెళ్లిపోయారని, దాదాపు 22 నుంచి 23 గంటల పాటు వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఫోన్‌ను లాక్కున్నారన్నారు. బెడ్రూమ్ నుంచి తనను బలవంతంగా బయటకు తీసుకెళ్తున్న సమయంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత శనివారం అర్ధరాత్రి దాటాక, ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయనను విడుదల చేశారు. మరోవైపు, పోలీసులు విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ధ్రువ్ రాఠీ మళ్లీ జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆయనపై మళ్లీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!