కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!
- సోషల్ మీడియాలో వైరల్
- ధ్రువ్ జురెల్ అద్భుత స్టంపింగ్
- ఐపీఎల్ 2026లో మొదటి విజయాన్ని అందుకున్న కోల్ కతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Jurel Stumping: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన కీపింగ్ స్కిల్స్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేకేఆర్ (KKR)తో జరిగిన మ్యాచ్ లో అతడు చేసిన స్టంపింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి స్పిన్నర్లకు వికెట్‌కీపింగ్ చేయడం చాలా కష్టం. బంతి తక్కువ సమయంలోనే బ్యాట్స్‌మన్ కి చేరుతుంది కాబట్టి కీపర్ చాలా అలర్ట్ గా ఉండాలి. కేకేఆర్, రాజస్థాన్ మ్యాచ్‌లో ఇదే విషయం స్పష్టంగా కనిపించింది. జురెల్ తన కీపింగ్ స్కిల్స్ తో అసాధ్యాన్ని సాధ్యంగా మార్చాడు.
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
Also Read
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
- Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
ఈ మ్యాచ్ కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీనితో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది. ఇక 156 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ కేకేఆర్ మొదట్లో ఒత్తిడిలో పడింది. మొదట రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కేకేఆర్‌ను కుదిపేశారు. టిమ్ సైఫర్ట్, అజింక్య రహానే లాంటి కీలక బ్యాటర్లు డకౌట్ కావడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెమెరూన్ గ్రీన్ వేగంగా 13 బంతుల్లో 27 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పేలా కనిపించాడు.
అయితే రవి బిష్ణోయ్ వేసిన ఓ అద్భుత బంతి మ్యాచ్ ను పూర్తిగా మలుపు తిప్పింది. గ్రీన్ ముందుకు వచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బంతి లెగ్ సైడ్ వైపు వెళ్లింది. సాధారణంగా ఇది వైడ్ గా వెళ్లే బంతి. కానీ అక్కడే జురెల్ తన అసాధారణ ప్రతిభను బయట పెట్టాడు. ఒక్కసారిగా ఎడమవైపు డైవ్ చేస్తూ బంతిని అందుకుని, నియంత్రణ కోల్పోయినా కూడా చాకచక్యంగా స్టంప్స్ పైకి బాల్ ను రెప్పపాటు సమయంలో విసరడంతో గ్రీన్‌ను ఔట్ చేశాడు. ఈ వికెట్‌తో రవి బిష్ణోయ్ ఐపీఎల్ పర్పుల్ క్యాప్ రేసులోకి కూడా వచ్చాడు. ప్రస్తుతం అతడు 6 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
ఇదిలా ఉండగా, జురెల్ చేసిన ఈ స్టంపింగ్ గతంలో టీమిండియా కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనిని స్టెంపింగ్స్ ను గుర్తు చేస్తున్నాయంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అయితే చివరకు 156 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించి ఐపీఎల్ 2026లో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తాజావార్తలు
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?