PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
- పంజాబ్ కింగ్స్ 254/7 భారీ స్కోర్ నమోదు
- ప్రియాంశ్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్
- కూపర్ కానొల్లి 87 పరుగులతో కీలక భాగస్వామ్యం
- లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 200/5కే పరిమితం
- 54 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PBKS vs LSG: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (PBKS) దూకుడును కొనసాగిస్తోంది. ఆదివారం రాత్రి న్యూచండీగఢ్‌లో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై 54 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో ప్రియాంశ్ ఆర్య LSG బౌలర్లపై విరుచుకపడి 37 బంతుల్లో 93 పరుగులు చేశాడు. అతనికి తోడుగా కూపర్ కానొల్లి 46 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. చివర్లో స్టోయినిస్, శశాంక్ సింగ్ వేగంగా పరుగులు చేయడంతో టీమ్ 250+ చేరుకుంది.
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
Also Read
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ఇక LSG 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఒత్తిడికి గురయ్యారు. మిచెల్ మార్ష్ (40), అయ్యుష్ బదోని (35), కెప్టెన్ రిషభ్ పంత్ (43) కొంత పోరాటం చేసినప్పటికీ, భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యారు. చివరకు 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేయగలిగారు. బౌలింగ్‌లో పంజాబ్ తరఫున మార్కో జాన్సన్ రెండు వికెట్లు తీసి LSGను కుదిపేశాడు. చాహల్ తన స్పిన్‌తో కీలక బ్రేక్ ఇచ్చాడు.
PBKS vs LSG: బౌలర్లను ఉతికారేసిన ప్రియాంశ్ ఆర్య, కనోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. జట్టు సమిష్టి ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తే వారు మెరుగైన ప్రదర్శన చేస్తారని, అదే తమ మంత్రం అని పేర్కొన్నాడు. కోచ్ రికీ పాంటింగ్ ప్రేరణ కూడా జట్టుకు ఉపయోగపడుతోందని చెప్పాడు. LSG కెప్టెన్ రిషభ్ పంత్ ఓటమిపై స్పందిస్తూ.. బ్యాటింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని అంగీకరించాడు. జట్టు మీద నమ్మకం ఉందని, కానీ పంజాబ్ మంచి క్రికెట్ ఆడిందని అభినందించాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు నమోదు చేసి, ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా మారింది.
తాజావార్తలు
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!