Thalapathy68: విజయ్ కు విలన్ గా ధోనీ.. ఇదెక్కడి మాస్ రా మావా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత Thalapathy68 ను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం.. విజయ్ చివరి సినిమా ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది కాబట్టి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక అప్పటిలోగా ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలనీ విజయ్ అనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే లియో షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. మరికొన్ని రోజుల్లో Thalapathy68 పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన జ్యోతిక నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఖుషీ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన విషయం తెల్సిందే.
Harold Das: రూత్ లెస్ విలన్ గా అర్జున్.. రోలెక్స్ కనిపించాడు బ్రో
Also Read
ఇక తాజగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాతో మాజీ క్రికెటర్ ధోనీ నటుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అందులో కూడా విజయ్ ధీటుగా విలనిజాన్ని పండించబోతున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ మధ్యనే ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. LGM సినిమాతో ధోనీ భార్య సాక్షి నిర్మాతగా మారింది. ఆ సినిమా ప్రమోషన్స్ లోనే మంచి కథ ఉంటే ధోని ఖచ్చితంగా సినిమాల్లో నటిస్తారు అని చెప్పడంతో వెంకట్ ప్రభు.. ధోనీని విలన్ గా చూపించడానికి రెడీ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఊర మాస్ కాంబినేషన్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి వెంకట్ ప్రభు ఎలాంటి క్యాస్టింగ్ తో వస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!