తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా అలాగే సింగర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఇప్పటికే ధనుష్ దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కగా, తాజాగా మూడో ప్రాజెక్టును కూడా ప్రకటించారు.ప్రస్తుతం ‘DD3’ అనే వర్కింగ్ టైటిల్ తో ధనుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.తాజాగా ధనుష్ ‘DD3’ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కాన్సెప్ట్ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ పోస్టర్ ఎంతో ప్రెజెంట్ గా కనిపిస్తోంది. బీచ్ లో పసుపు రంగు బెంచ్ అలాగే దాని మీద ఏదో రాసిన ఉన్న పలు పేపర్లు కనిపిస్తున్నాయి. ఆకాశం,సముద్రం కలిసి పోయినట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.. D అక్షరాన్ని పోలి ఉండే రెండు నెలవంకలు తన మూడో వెంచర్ కు సింబాలిక్ గా 3వ నంబర్ వచ్చేలా చక్కగా పోస్టర్ ను డిజైన్ చేసారు.. ఇక ‘DD3’ కాన్సెప్ట్ పోస్టర్ కు పైన ఎడమ భాగంగాలో వండర్ బార్ ఫిల్మ్స్ లోగో కూడా కనిపిస్తుంది.అంటే ఈ సినిమాను ధనుష్ సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా టైటిల్ మరియు నటీనటుల వివరాలు తెలియకపోయినప్పటికీ మూవీకి సంబంధించి డిసెంబర్ 24, 2023 నాడు అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. ధనుష్ దర్శకుడిగా తన రెండవ ప్రాజెక్ట్ చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేశాడు. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘D50’ అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు.. ధనుష్ ట్విట్టర్ వేదికగా సినిమాలో భాగస్వామ్యం అయిన వారందరికి కృతజ్ఞతలు చెప్పారు. అటు తన విజన్ కు సపోర్టు చేసిన కళానిధి మారన్ తో పాటు సన్ పిక్చర్స్ కు కూడా థ్యాంక్స్ చెప్పారు.ఇదిలా ఉంటే ధనుష్ నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్ ‘ 2024 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమలో శివ రాజ్ కుమార్ మరియు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్ ‘ సినిమా రూపొందుతోంది.