Hero Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే అలరిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ చూపిస్తున్నారు. గతేడాది రాయన్ తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన తాజాగా తన దర్శకత్వంలో తెరకెక్కిన జాబిలమ్మ నీకు అంత కోపమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన మేనల్లుడు పవీష్ నారాయణన్ ను హీరోగా ‘‘జాబిలమ్మ నీకు అంత కోపమా’’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జెన్ జీ బ్యాచ్‌ను టార్గెట్ చేస్తూ తీసిన ఆ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. రోమ్ కామ్ డ్రామాగా ఆడియన్స్ ను అలరిస్తోంది. కొంతమంది కుర్రాళ్లు, యంగ్ హీరోయిన్లతో తెరకెక్కిన ఆ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
అయితే ఆ సినిమాకు సంబంధించిన ఓ రిహార్సల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో హీరో పవీష్ కు ధనుష్ సీన్ ఎంటో చెబుతూ కనిపించారు. అంతే కాదు.. ఆయన నటించి మరీ చూపించారు. ఆ పాత్రలో ఆయన జీవించేశారు. సీన్ లో భాగంగా నిజంగా టీ షర్ట్ తో సీనియర్ నటి కాళ్లు కూడా తుడిచారు. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ధనుష్ చాలా గ్రేట్ అంటూ పొగిడేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన టీ షర్ట్ తో నటి కాళ్లు తుడిచారని చెబుతున్నారు. అదే సమయంలో ధనుష్ లా పవీష్ చేయలేదని చెబుతున్నారు. మ్యాచ్ కూడా చేయలేకపోయారంటూ కొందరు సినిమా చూసిన వాళ్లు అంటున్నారు. అయితే కొత్త హీరో కదా.. కాస్త ఎక్స్ పీరియన్స్ కావాలి కదా అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
Read Also:MK Stalin: తమిళానికి కేవలం రూ. 74 కోట్లు, సంస్కృతానికి రూ. 1488 కోట్లా.?
Yaar Enna venalum solitu pongada! Antha aalu intha velaiya passion oda rasichiii Pandraaaru! #Dhanush 🫶🏻🤍#NeekBlockbuster #Neek #Dragon #PradeepRanganathan pic.twitter.com/obCbMJjZ5Z
— Idiotic. (@Idiotic888) February 21, 2025
Read Also:Jharkhand: దారుణం.. మేకను దొంగిలించారని ఇద్దరు యువకులను కొట్టి చంపారు?
ప్రస్తుతం ధనుష్ తెలుగులో కుబేర సినిమా చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మూవీలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు, నిత్యా మీనన్ తో ఇడ్లీ కడై టైటిల్ తో ధనుష్ మూవీ చేస్తున్నారు. దీనికి నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. వాటితో పాటు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు.