Yuzvendra Chahal left married life early Said Dhanashree Verma: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, యూట్యూబర్ ధనశ్రీ వర్మల వివాహబంధం ముగిసిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. 2020 డిసెంబరులో పేమించి పెళ్లి చేసుకున్న చహల్, ధనశ్రీలు.. విభేదాల కారణంగా 2022 జూన్ నుంచి విడిగా ఉంటున్నారు. 2025 ఫిబ్రవరి 5న విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. మార్చి 20న డివోర్స్ మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆర్జే మహ్‌వశ్‌తో చహల్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అయితే ఇప్పటికే విడాకుల అంశంపై చహల్ స్పందించగా.. తాజాగా ధనశ్రీ మాట్లాడారు. కోర్ట్ తీర్పు ఇస్తున్నపుడు తాను భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయానని చెప్పారు.
‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనశ్రీ వర్మ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు. ‘డివోర్స్ కోసం నేను మానసికంగా సిద్ధమయ్యాను. చివరిరోజు జడ్జి గారు విడాకుల తీర్పును ఇస్తున్నపుడు నేను భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోయా. అందరి ముందు గట్టిగా ఏడ్చేశా. అది నాకు ఇంకా గుర్తుంది. ఆ సమయంలో నా మనసుకు ఏమైందో అర్ధం కాలేదు. ఆ భాధను మరెవరూ అర్థం చేసుకోలేరు. వైవాహిక జీవితం నుంచి యుజ్వేంద్ర చహల్ ముందుగా వెళ్లిపోయాడు. ఇదంతా జరిగిపోయిన విషయం. ఇప్పుడు నా జీవితంలో ముందుకు వెళుతున్నా’ అని ధనశ్రీ వర్మ చెప్పారు.
Also Read: Asia Cup 2025: ఏడుగురు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్‌లు.. బీసీసీఐ సెలెక్టర్ల ఎత్తుగడ అదేనా?
కోర్టు విచారణ సమయంలో యుజ్వేంద్ర చహల్ ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కోట్ రాసి ఉన్న టీషర్ట్ ధరించాడు. దీనిపై కూడా ధనశ్రీ వర్మ మాట్లాడుతూ… ‘ఇలాంటి విషయాల్లో ఎదుటివారు మనల్ని నిందిస్తారని తెలుసు. ఇలాంటి ఓ స్టంట్ (టీషర్ట్ స్టంట్) ఉంటుందని నేను ముందుగానే ఊహించా. తప్పంతా నాదేనని చూపేందుకు ఎదుటివారు సిద్ధంగా ఉంటారని తెలుసు. హే బ్రదర్ నువ్వు నాకు వాట్సాప్ చేసి ఉండొచ్చు, టీషర్ట్ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది. ఆ క్షణంలో కృంగిపోయాను. నా జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ అండగా ఉన్నా. చాలా ప్రేమించా. అందుకే డివోర్స్ అన్నపుడు నా మనసు వేదనకు గురైంది. విడాకులు అంత సులభం కాదు. విడాకుల సమయంలో కూడా గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కుటుంబం విలువలకు నేను భంగం కలిగించదలచుకోలేదు. అందుకే హుందాగా వ్యవహరించా. ఇక ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా’ అని ధనశ్రీ వర్మ కౌంటర్ ఇచ్చారు.