Camphor Aarti into Hundi: కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఆలయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఒక భక్తురాలు చేసిన నిర్వాకంతో అక్కడ ఉన్న హుండీకి స్వల్ప ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆలయంలో వెలుగుతున్న కర్పూరం హారతిని తీసుకున్న భక్తురాలు దానిని వెళ్లి నేరుగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి హుండీలో వేసింది. దీనితో హుండీలో ఉన్న నోట్లకు వెంటనే నిప్పు అంటుకోవడంతో.. హుండీ నుంచి పొగ రావడాన్ని ఆలయ సిబ్బంది గమనించారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే హుటాహుటిన హుండీలో నీళ్లు పోయడంతో పెను ప్రమాదం తప్పింది.
AI సౌండ్ ఫోకస్, LUMO ఇమేజ్ ఇంజిన్‌తో భారత్‌లో OPPO Find X9, Find X9 Pro నవంబర్ 18న విడుదల!
హుండీలో నీళ్లు పోయడంతో లోపల ఉన్న డబ్బు తడిచిపోయింది. దీంతో ఆలయ సిబ్బంది తడిచిన నోట్లను జాగ్రత్తగా తీసి, పొడి వస్త్రంతో తుడిచి ఆలయ ఆవరణలో ఆరబెట్టారు. అంతేకాకుండా, హుండీ, డబ్బు పూర్తిగా ఆరిపోయేందుకు హెయిర్ డ్రైయర్ మిషన్లను ఉపయోగించి వేడి గాలితో ఆరబెట్టారు. ఈ ఘటనలో కొన్ని నోట్లు సగం కాలిపోయినట్లుగా గుర్తించారు. ఈ చర్యకు పాల్పడిన భక్తురాలిని గుర్తించేందుకు ఆలయ అధికారులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఆ భక్తురాలిని అధికారులు గుర్తించారు. కాలిపోయిన డబ్బును ఆ భక్తురాలు నుంచి రికవరీ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.