పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “దేవర”. ఈ బిగ్గెస్ట్ కాంబో లో వస్తున్న దేవర చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా లో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల జోడీ స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తుందని సమాచారం.అలాగే ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్ర ఇంకా హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికీ పూర్తి చేసే విధంగా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. కొరటాల శివ గత చిత్రం అయిన ఆచార్య సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దీనితో దేవర సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా దేవర సినిమా సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను అనౌన్స్ చేసారు.టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.దసరా కానుకగా ఈ సినిమా నుంచి ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.దీనితో దసరా అప్డేట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ హిందీ సినిమా వార్ 2 షూటింగ్ పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రం లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.