జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. బిల్లింగ్ అనుమతికి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు పట్టుబడ్డారు. విటల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విటల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. రెండు బిల్డింగ్లకు ఎన్వోసీ ఇవ్వడానికి ఎనిమిది లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. నాలుగు లక్షలు తీసుకొని మరో నాలుగు లక్షలు డిమాండ్ చేయడంతో వెంకట్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2024లో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంది. 170 మంది ప్రభుత్వ అధికారులు దుష్ప్రవర్తన, లంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికి పోయారు. ఈ ఏడాది తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఛేదించిన కేసుల వివరాలు, సమాచారాన్ని తాజాగా పంచుకుంది. అవినీతిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖలు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.