Israel-Iran: ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్.. అమెరికా కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran: ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ ఏకకాలంలో ఇజ్రాయెల్ నగరాల వైపు 300 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ 99 శాతం డ్రోన్లు మరియు క్షిపణులను గాలిలో నాశనం చేసినట్లు పేర్కొంది. ఇరాన్ చేసిన ఈ దాడిలో అమెరికా కూడా ఇజ్రాయెల్‌కు సహాయం చేసింది. యూఎస్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ పెంటగాన్ ప్రకారం, ఇది 80 కంటే ఎక్కువ ఇరాన్ డ్రోన్‌లు (యూఎవీ), కనీసం ఆరు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసింది. ఇరాన్ లాంచర్ వాహనంపై అమెరికా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాల్లో ఏడు యూఏవీలను కూడా ధ్వంసం చేసిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.శనివారం అర్ధరాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ డ్రోన్‌లను ప్రయోగించిందని తెలిసిందే. వందలాది డ్రోన్లు, క్షిపణులు ఆకాశంలో ఏకకాలంలో ఇజ్రాయెల్ వైపు కదులుతున్న దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భారత కాలమానం ప్రకారం, ఇజ్రాయెల్ ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో రాత్రి 3 గంటలకు ఇజ్రాయెల్ ఈ భారీ దాడి చేసింది.
Read Also: Seized Ship: నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. ఆ 17 మంది భారతీయ సిబ్బందికి కాస్త ఊరట
Also Read
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ఇరాన్ దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డానియెల్ హగేరీ పేర్కొన్నారు. ఇరాన్ తమ భూభాగంపైకి 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్ క్షిపణులు, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని వెల్లడించారు. మొత్తంగా వీటిల్లో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ భూభాగంపైకి వచ్చాయని, ఒక ఎయిర్ బేస్‌కు స్వల్ప నష్టం చేకూరిందని, అయితే అది ఇప్పటికీ పనిచేస్తుందని తెలిపారు. కాగా, తమ లక్ష్యాన్ని సాధించామని, ఆదివారం ఉదయానికి దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగించే అవకాశం లేదని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మహ్మద్ హుస్సేన్ భగేరీ పేర్కొన్నారు. మరోవైపు తమ దేశ గగనతలాన్ని రీఓపెన్ చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. రెండు వారాల క్రితం సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ తాజా దాడులు చేసింది.
Read Also: Devyani Khobrogade: కంబోడియా న్యూ ఇయర్ వేడుకలు.. ‘అప్సర’గా కనిపించిన భారత రాయబారి
ఇరాన్ దాడిని ఊహించి, ఇజ్రాయెల్ అప్పటికే పాఠశాలలను మూసివేసింది. సైన్యాన్ని అప్రమత్తం చేశారు. నిజానికి ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ ఎంబసీ దగ్గర దాడి చేసింది. ఇది తమ ప్రతీకారం అని ఇరాన్ అంటోంది. ఏప్రిల్ 1న సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో, ఇరాన్ టాప్ కమాండర్‌తో సహా చాలా మంది సైనిక అధికారులు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. అప్పటి నుంచి ఇరాన్ ఇలాంటి దాడికి పాల్పడుతుందనే భయం నెలకొంది. ఈ దాడి ప్రతిదాడుల అనంతరం అమెరికా కూడా ఇరాన్‌పై దాడి చేయవద్దని హెచ్చరించింది. దాడి చేస్తే ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని బెదిరించింది.
ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా తిప్పికొట్టిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ సంభాషణలో ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్‌పై దాడికి దిగొద్దని.. కాదని దాడి చేస్తే అమెరికా నుంచి ఎలాంటి సహకారం ఉండబోదని.. మెజారిటీ డ్రోన్లు, క్షిపణులను కూల్చడమే ఇజ్రాయెల్‌కు అతిపెద్ద విజయమని.. ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టం జరగలేదు. ప్రతిదాడులకు దిగడం అనవసరమని అని బైడెన్ తన అభిప్రాయాన్ని నెతన్యాహుతో చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోసారి దాడి జరిగితే పశ్చిమాసియాలో పరిస్థితి చేయి దాటి పోతుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!