Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- దయచేసి నా జీతం ఇవ్వండి... లేకపోతే నేను చనిపోతా
- తీవ్ర చర్చకు దారితీసిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 5 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా హోంగార్డు ఆసుపత్రి ప్రాంగణంలో కన్నీటి పర్యంతమవుతూ “దయచేసి నా జీతం ఇవ్వండి… లేకపోతే నేను చనిపోతా” అంటూ వేడుకోవడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు
జంషెడ్‌పూర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (MGM) మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో భద్రతా విధులు నిర్వహిస్తున్న 135 మంది హోంగార్డులు గత 5 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
విధుల్లోనే ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా హోంగార్డు
జూలై 8న మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న మహిళా హోంగార్డు అలాదిన్ మహాలి క్యాంపస్‌లో ఉన్న ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సహచరులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. చికిత్స సమయంలో మాట్లాడిన ఆమె, 5 నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబం ఆకలితో అలమటిస్తోందని తెలిపింది. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ చికిత్స చేయించేందుకు డబ్బు లేదని, కుమారుడి స్కూల్ ఫీజు కూడా చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మరో మహిళా హోంగార్డు కన్నీటి పర్యంతం
ఈ ఘటన మరువకముందే జూలై 18న మరో మహిళా హోంగార్డు ఫుల్కుమారి హెంబ్రామ్ ఆసుపత్రి ప్రాంగణంలో కన్నీళ్లు పెట్టుకుంది. “ఐదు నెలలుగా వేతనం అందలేదు. కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారింది. నాకు కడుపు సంబంధిత తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంది. కానీ డాక్టర్ కు చూపించడానికి, మందులు కొనడానికి కూడా నా వద్ద డబ్బు లేదు. దయచేసి నా జీతం ఇప్పించండి… లేదంటే నేను చనిపోతా” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.
యాజమాన్యం ఏమంది?
మొదటి ఘటన అనంతరం MGM మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి బాధిత మహిళా హోంగార్డును పరామర్శించారు. ఆమెకు తక్షణ ఆర్థిక సహాయం కూడా అందించారు. వేతనాల చెల్లింపుపై ఇప్పటికే సంబంధిత శాఖకు లేఖ రాశామని, అయితే ప్రధాన కార్యాలయం నుంచి బడ్జెట్ నిధులు ఇంకా విడుదల కాలేదని తెలిపారు. నిధులు విడుదలైన వెంటనే 135 మంది హోంగార్డుల పెండింగ్ వేతనాలను ప్రాధాన్య క్రమంలో పూర్తిగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తీవ్ర చర్చకు దారితీసిన ఘటన
వరుసగా ఇద్దరు మహిళా హోంగార్డులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవడం జార్ఖండ్‌లో ప్రభుత్వ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో ప్రాణాలపై ఆశలు కోల్పోయే స్థితికి ఉద్యోగులు చేరుకోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
खाकी वर्दी के पीछे जो महिला है वो तनख्वाह न मिलने के दर्द में है । एमजीएम अस्पताल में एक महिला होमगार्ड का फफक-फफक कर रोना व्यवस्था की असंवेदनशीलता को उजागर करता है। पांच महीने से वेतन का इंतजार, ऊपर से गंभीर बीमारी का बोझ—यह कैसी परीक्षा है? क्या उसकी मेहनत का मोल केवल खामोशी और… pic.twitter.com/fHbPSaZCcn
— mukesh kumar (@Mukesh_Ranchi) July 18, 2026
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?