Pawan Kalyan: కూటమి ఆరు నెలల పాలనలో అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ట్వీట్..
- కూటమి ఆరు నెలల పాలనలో అభివృద్ధి మైలురాళ్ళు- డిప్యూటీ సీఎం
- వైసీపీ ఐదేళ్ల పాలనకు మించి అభివృద్ధి చేశాం- పవన్ కల్యాణ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులుగా వస్తున్నాయని.. ఇటీవల విశాఖపట్నం వేదికగా రూ.2.08 లక్షల కోట్ల పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని ట్వీట్ చేశారు పవన్..
కూటమి ఆరు నెలల పాలనపై పవన్ కల్యాణ్ స్పందించారు. హనీమూన్ పీరియడ్ ముగిసిందని ఇప్పటికే పవన్ ప్రకటించారు. తాజాగా ఈ ఆరు నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి పవన్ కీలక అంశాలు ట్వీట్ చేసారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు సైతం చంద్రబాబు సర్కార్ టెండర్లు ఆహ్వానించిందన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు సైతం ఊపందుకున్నాయి. కాగా, గత ఐదేళ్లపాటు వైసీపీ హయాంలో ఏపీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు పవన్.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక మైలు రాళ్లను చేరుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ ఐదేళ్ల పాలనకు మించి అభివృద్ధి చేసి చూపించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ఐదేళ్ల పాలనతో పోలుస్తూ తాము చేసిన పనుల వివరాలను తెలుపుతూ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు..
ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొన్ని మైలురాళ్లు సాధించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కింద వైసీపీ ఐదేళ్ల పాలనలో 1800 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మిస్తే ఎన్డీయే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే 3,750 కి.మీ. సీసీ రోడ్లు వేసినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మినీ గోకులాలు కేవలం 268 ఏర్పాటు చేస్తే, తాజాగా ఆరు నెలల్లోనే 22,500 నిర్మించినట్లు వెల్లడించారు. పీవీటీజీ ఆవాసాల కోసం వైసీపీ రూ.91 కోట్లు ఖర్చు చేస్తే, తాము కేవలం ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!