సందీప్ కిషన్ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. ఈరోజు, మజాకా హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాథ్ నక్కిన మాట్లాడుతూ హీరోయిన్ అన్షు గురించి సంచలన కామెంట్స్ చేశారు. ముందుగా ఆయన మాట్లాడుతూ మజాకా నాకు చాలా ఇష్టమైన కథ. సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన్మధుడు తర్వాత అన్షు ఈ సినిమాలో నటించడం ఆనందంగా వుంది అంటూనే కొన్ని మాటలు మాట్లాడారు. అన్షు ఫారెన్ నుంచి వచ్చాక సన్నగా ఉందని, కాదమ్మా తెలుగుకు సరిపోదు.
Mazaka Teaser: మెగాస్టార్ చేయాలనుకున్న ‘మజాకా’ టీజర్.. భలే ఉంది చూశారా?
కొంచెం అన్నీ ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా, పర్లేదు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అని ఆమె చెప్పుకొచ్చారు. తన పాత్ర చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా చేసింది. రీతు వర్మ ఎక్సలెంట్ యాక్టర్. సందీప్ గారితో ఎప్పటినుంచో సినిమా చేయాలని వుండేది. ఈ సినిమా తనతో చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ కథే అందరినీ ఎంచుకుంది. సినిమా రీలైనన తర్వాత సీట్లు కాదు గేట్లు పగులుతాయనిపిస్తోంది. అంత కామెడీ వుంటుంది సినిమాలో. ప్రతి సీన్ ప్రసన్న గారు అద్భుతంగా రాశారు. ఎమోషన్ సీన్స్ కూడా వుంటాయి. సందీప్ గారు ఎక్సలెంట్ గా చేశారు. నిజార్ చాలా చక్కని ఫోటోగ్రఫీ ఇచ్చారు. నిర్మాత రాజేష్ గారు చాలా ఓపిగ్గా ఈ సినిమా చేశారు. ఈ సినిమా ఆయనకి పెద్ద విజయం ఇస్తుంది. ఫిబ్రవరి 21న సినిమా మీ ముందుకు వస్తోంది. ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయండి’ అన్నారు.