Pawan Kalyan: 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

  • రేపట్నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
  • రేపు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం
Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ రేపట్నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రేపు ఉదయం 7.30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కల్యాణ్ రానున్నారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పవన్‌ పాల్గొననున్నారు. మధ్యాహ్నం చేబ్రోలు నివాసంలో పిఠాపురం జనసేన నేతలతో భేటీ కానున్నారు.

Read Also: AP Pensions: ఏపీలో పింఛన్ల పండుగ.. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి సర్వం సిద్దం

జులై 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పంచాయితీ, అటవీ కీలక శాఖలపై సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. జులై 3న ఉప్పాడ, యు.కొత్తపల్లిలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ కీలక నేతలతో భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో వారాహి బహిరంగ సభలో పాల్గొననున్నారు. తర్వాత హెలికాప్టర్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు.