Cyber Criminals: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. టాస్క్ ల పేరుతో 11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Criminals: సంగారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి అధిక డబ్బు ఆశ చూపి రూ.41.29 లక్షలు కేటుగాళ్ళు కాజేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ లో ఉండే ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. దీంతో నిజమని నమ్మిన ఉద్యోగి మెసేజ్ కు రిప్లై ఇచ్చాడు. అంతే కేటుగాళ్లు ఈ ఉద్యోకి తలపై టోకరాపై పెట్టేశారు. పక్కా ఉద్యోగం వస్తుందంటూ నమ్మించారు. అయితే పార్ట్ టైం జాబ్ వస్తుందని భావించిన ఉద్యోగి వాళ్లు చెప్పిన ప్రాసెన్ ఫాలో అయ్యాడు. ఉద్యోగం కోసం విడతల వారిగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తరువాత వారికి కాల్ చేసిన నో రెన్పాన్స్ దీంతో మోసపోయానని భావించిన ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం వస్తుందని మోసపోయానని, తన డబ్బులు తనకు ఇప్పించాలని కన్నీరుమున్నీరయ్యాడు. ఇక మరోవైపు పటాన్ చెరులో ఉండే మరో ఉద్యోగి నుంచి రూ. 11.29 లక్షలను టాస్క్ ల పేరుతో సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఆలస్యంగా గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read also: MLC Jeevan Reddy: అనవసర ప్రాజెక్ట్ లు కట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు..
Also Read
ఇక తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఎన్.రాజేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే.. నగరంలోని ఎల్లారెడ్డి గూడలో విజయ రాజరాజేశ్వరి కనస్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఓ కార్యాలయాన్ని తెరిచాడు. అంతేకాకుండా.. తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక శాతం రాబడి, వడ్డీలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేశాడు. దీంతో.. తన స్నేహితులు, బంధువుల ద్వారా ఎంతోమందిని బుట్టలో వేసుకున్నాడు. ఇక రియల్ ఎస్టేట్ సంస్థ వీఆర్‌ఆర్ గ్రూప్స్‌లో నగదు డిపాజిట్, పెట్టుబడితో ప్రతి ఏడాది 24 నుంచి 27శాతం వడ్డీ ఇస్తామని నమ్మించాడు. కాగా.. తమ రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా తాము నిర్మించే హోటళ్లతో లాభాల పంట పడుతుందంటూ బుట్టలో పడేశాడు. ఇక.. మొదట్లో కొందరికి నెలవారీ వడ్డీలు ఇవ్వడంతో ఇదంతా నిజమనే వారు నమ్మారు. దీంతో.. సుమారు 100 మంది ఇతడి మాటలు నమ్మి భారీఎత్తున అతడి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇక నగరానికి చెందిన 29 మంది బాధితులు రూ.23 కోట్ల మేర ఆ సంస్థలో డిపాజిట్ చేశారు. అయితే.. ఈ నెల 2న కూకట్‌పల్లికి చెందిన ఐటీ నిపుణురాలు ఇచ్చిన ఫిర్యాదుతో వీఆర్‌ఆర్ సంస్థ, డైరెక్టర్లు రాజేశ్, వాణి, వినోద్‌రావు, రవి, బ్రహ్మయ్య, ఎం.రవి, ఏ.కృష్ణ, తాడిమెటీరావు తదితరులుపై నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!