NTV Telugu Site icon

Bhatti Vikramarka: రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Bhatti Vikramarka: ఈమధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేరళలో, జార్ఖండ్ మంచి మెజారిటీ… మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కేరళ వయనాడ్‌లో అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలిచారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాబట్టి దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో మంచి మెజారిటీతో గెలిపించుకుంటున్నారన్నారు. స్థానిక ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. త్వరలో సీఎం రేవంత్.. పీసీసీ అధ్యక్షుడు భేటీ అవుతారని చెప్పారు. ప్రతినెల ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం కడుతోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గ్యాస్ రూ.500కే ఇస్తున్నామని చెప్పారు. రైతు భరోసాపై కసరత్తు జరుగుతోందని… ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా త్వరలో విధివిధానాలు ప్రిపేర్ అవుతున్నాయన్నారు.

Read Also: Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌.. సాస్కి 2024-25 తొలి విడత నిధులు విడుదల

2 లక్షల లోపల ఆదాయం ఉన్నవాళ్లకు త్వరలో రేషన్ కార్డులు ఇవ్వనున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇన్నాళ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇంట్లో పడుకుని ఇప్పుడు దానిపై కొందరు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. అసలు చిత్తశుద్ధి లేకుండా ఇన్నాళ్లు పాలించి… ఇప్పుడు హడావుడి చేస్తున్నారన్నారు. 2లక్షలు రూపాయల రుణమాఫీ చేసి చేస్తామని చెప్పి దాన్ని అలాగే వదిలేసి… రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. మేము అధికారంలోకి రాగానే… 18 వేల కోట్ల రూపాయలు మూడు నెలల్లో ఇచ్చామన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అందరికీ అన్ని అవకాశాలు సమానంగా ఇవ్వాలని.. కులగణన చేసి రిజర్వేషన్ అందేలా చూస్తున్నామన్నారు. కులగణనా పూర్తి అయ్యాక… చర్చ పెడుతామని.. ఎంత శాతం అనేది క్లారిటీ వస్తుందన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు.. ఇక్కడ రిజల్ట్స్ చూసి దేశ వ్యాప్తంగా అమలుకు డిమాండ్ చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేటీఆర్ గత కొన్నిరోజులుగా ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వంపైనా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు అన్ని బార్లా తెరిచి భావప్రకటన స్వేచ్ఛను ఇచ్చి… అందరూ మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు.. మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు… వాళ్ళు ఏమి చెయ్యకుండా ఇపుడు అన్ని మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు 57 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. కనీసం గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయారు.. అప్పుల బారిన పడేయడం తప్పా మీరు ఏమి చెయ్యలేదని విమర్శించారు. విద్యార్థుల చదువుల అంశంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. ఫుడ్ పాయిజనింగ్ అనేది దురదృష్టవశాత్తూ జరిగిందన్నారు. ఇప్పటికే హైజీనిక్ ఫుడ్, న్యూట్రీషియన్ ఫుడ్స్ అందించాలని ఆదేశించామన్నారు. కేటీఆర్ మైండ్ సెట్ అర్థం అవుతుంది.. ఇంకా బూర్జువా, భూస్వామ్య వ్యవస్థ లక్షణాలు పోలేదన్నారు.ఐఏఎస్ అధికారులు అంటే రెస్పెక్ట్ లేదని మండిపడ్డారు. సంస్కారం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడ్డం సరైంది కాదన్నారు.

Read Also: Hyderabad Crime: సోదరిపై యువకుడు కామెంట్.. కొట్టి చంపిన సోదరులు

ఝార్ఖండ్ ప్రజల విజయం… అక్కడ ప్రజలు సమిష్టిగా ఇచ్చిన విజయమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.ఉమ్మడిగా పోటీ చేయడం.. మంచి గెలుపును ఇచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ వాళ్ల లాగానే మేము ఉన్నామని అనుకుంటున్నారన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి మంత్రి పనీమంతులే…ఏ శాఖ ఆ శాఖ పనిచేసుకుంటున్నారన్నారు. రాజకీయాల్లో అనేక సంవత్సరాలు పనిచేసిన నేతలు… కొత్తగా జాయిన్ అయినా వారికి ఇక్కడ చాలా కాలంగా ఉన్నవారికి కలిసిపోవడానికి కొంత టైం పడుతుందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మె్ల్యేలందరూ టచ్‌లో ఉన్నారన్నారు. కేటీఆర్ , బీఆర్‌ఎస్ భ్రమల్లో బతుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో తొలగించడం ఎవ్వరి తరం కాదన్నారు. ప్రభుత్వం స్టడీ చేస్తుంది.. నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహబూబ్ నగర్‌లో 30న రైతు సభ నిర్వహించబోతున్నామని తెలిపారు.

దేశవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు, ఆచారాలు ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. రీజినల్ రింగ్ రోడ్‌, మూసీ ప్రక్షాళన, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, మిడిల్ క్లాస్ వారికి ఇల్లు విషయంలో కూడా మంచి ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, HIG, LIG, MIG… మేము పక్కా ప్రణాళికలతో ఉన్నామన్నారు. AI లాంటి టెక్నాలజీతో.. అభివృద్ధి తో ముందుకు వెళ్లేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అద్భుతమైన ఆలోచనలు.. ప్రణాళికలతో… అభివృద్ధి… సంక్షేమం… వైపు మేము అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్టీ అధినాయకత్వం… సూచనల మేరకు వారి నిర్ణయం మేరకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్నారు.