NTV Telugu Site icon

Bhatti Vikramarka: స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి సింగ‌రేణి.. సంస్థ విశ్వవ్యాప్తంగా విస్తరించాలి

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

సింగ‌రేణి సంస్థ దేశ స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి ఉన్న సంస్థ.. ఎంతో నిష్ణాతులైన, స‌మ‌ర్ధులైన సిబ్బంది ఉన్న సంస్థ.. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగ‌రేణి ఇత‌ర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాల‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క సూచించారు. శని వారం బాబాసాహెబ్ అంబేద్కర్ స‌చివాల‌యంలో సింగ‌రేణి సంస్థ భ‌విష్యత్ ప్రణాళిలు, అభివృద్ధిపై జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధ‌న వ‌నరులకు కాలం చెల్లుతోంది. భ‌విష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలే కేంద్రంగా మార‌బోతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో లిథియం వంటి అనేక మూల‌కాల అన్వేష‌ణ‌, వాటిని వెలికితీయ‌డంపై సింగ‌రేణి దృష్టి సారించాల‌ని చెప్పారు.

READ MORE: Crime: దారుణం.. తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు

సింగ‌రేణి సంస్థ త‌న మ‌నుగ‌డ‌ను కొన‌సాగిస్తూ ఆస్తుల‌ను సంప‌ద‌ను సృష్టించుకోవాల‌ని సూచించారు. త‌ద్వారా రాష్ట్ర ప్రజ‌ల సంప‌దైన సింగ‌రేణి ద్వారా ఉద్యోగ‌-ఉపాధి అవ‌కాశాల కల్పన జ‌రుగుతుంద‌ని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సింగ‌రేణి సంస్థ మెట‌ల్స్, నాన్ మెటల్స్ మైనింగ్ లో ప్రపంచ‌వ్యాప్తంగా విస్తరించాల‌న్నారు. ఇందుకోసం అవ‌స‌ర‌మైతే ఒక క‌న్సెల్టెన్సీని నియ‌మించుకోవాల‌ని సింగ‌రేణి అధికారుల‌కు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రీన్ ఎన‌ర్జీలో భాగంగా రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజ్ ప‌వ‌ర్ ప్లాంట్ ల‌ను ఏర్పాటుకు స‌న్నాహ‌కాలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రికి సింగ‌రేణి అధికారులు వివ‌రించారు. ఇందుకు సంబంధించి పూర్తీ డీపీఆర్ లు రూపొందిస్తున్నామ‌ని.. త్వర‌లోనూ వాటిని ప్రభుత్వానికి అందిస్తామ‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్కకు వివ‌రించారు. ఒరిస్సాలోని నైనీ బ్లాక్ లో బొగ్గు ఎప్పటినుంచి ఉత్పత్తి ఆరంభిస్తార‌ని ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.