‘భక్తి టీవీ’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. విశేషమైన పూజలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. నవంబర్ 1న ప్రారంభమైన కోటి దీపోత్సవం భక్తుల మన్ననలు అందుకుంటోంది. నిన్న 8వ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఎన్టీవీ చైర్మన్ దంపతులు ఘనస్వాగతం పలికారు. నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు హాజరయ్యారు. వేద పండితులు, ఎన్టీవీ చైర్మన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..
Also Read:Ariyana : మూడేళ్లు అతనితో ఒకే రూమ్ లో ఉన్నా.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్
భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని సీఎం అన్నారు.. జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తాం అని భట్టి తెలిపారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం అద్భుతమైన కార్యక్రమం. అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటకు తీసుకొచ్చే దీపాలు వెలిగించే కార్యక్రమం అనేక శతాబ్దాలుగా మన సంస్కృతిలో ఉంది. సమాజాన్ని, తమను తమ కుటుంబాన్ని చల్లగా చూడమని కోరుకునే కార్యక్రమం ఇది అని కొనియాడారు. కోటి దీపోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా ప్రభుత్వం భావిస్తుందని భట్టి విక్రమార్క వెల్లడించారు.