‘భక్తి టీవీ’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. విశేషమైన పూజలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. నవంబర్ 1న ప్రారంభమైన కోటి దీపోత్సవం భక్తుల మన్ననలు అందుకుంటోంది. నిన్న 8వ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఎన్టీవీ చైర్మన్ దంపతులు ఘనస్వాగతం పలికారు. నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు హాజరయ్యారు. వేద…