ఈమధ్యకాలంలో గర్భిణులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో రోడ్డుపైనే ప్రసవించిందో మహిళ. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మహిళకు ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. నడిరోడ్డుపై కాసేపు నరకయాతన అనుభవించిందా గర్బిణీ. రోడ్డుపై మహిళ ఇబ్బంది పడుతున్న పట్టించుకోలేదు పాదచారులు, వాహనదారులు. మహిళ చుట్టూ అట్టముక్కలు పెట్టిన చుట్టుపక్కల షాపుల నిర్వాహకులు ఆమెకు ప్రసవం చేశారు.
Read Also: Charles Sobhraj: సీరియల్ కిల్లర్ ప్లేస్ లో సినిమా యాక్టర్ ఫోటో వేశారు…
తీవ్ర ఇబ్బంది పడిన అనంతరం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందా మహిళ. తల్లీబిడ్డా ఆరోగ్యంగానే వున్నారు. రోడ్డుపైనే ప్రసవించిన మహిళ, బాబుని పటాన్ చెరు ఏరియా ఆస్పత్రికి ఆటోలో తరలించారు స్థానికులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో వైద్య సేవలు అందరికీ అందుబాటులో వున్నాయని అధికారులు, మంత్రి హరీష్ రావు చెబుతున్నా.. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటూనే వున్నాయి.
గత నెలలో ఏపీలోని తిరుపతిలో నడిరోడ్డుపై మహిళ ప్రసవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే.. తెలంగాణలోని నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రసవం కోసం ఓ గర్భిణినీ కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి బంధువులు కారులో తీసుకువచ్చారు. అయితే.. ఆమెను ఆసుపత్రిలోకి తీసుకెళ్లే సమయంలో సిబ్బంది పట్టించుకోలేదు. స్ట్రెచ్చర్ తీసుకురాకుండా ఆలస్యం చేశారు. దీంతో తీవ్రమైన నొప్పులతో కారులోనే గర్బిణీ ప్రసవించాల్సి వచ్చింది. అయితే తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం పట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Skyroot Aerospace: ఆకాశం కూడా హద్దు కాదంటున్న ‘స్కైరూట్ ఏరోస్పేస్‘ పవన్ చందనతో ప్రత్యేక ఇంటర్వ్యూ