దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం అత్యంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఢిల్లీ అగ్నిగుండలా మారింది. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇదొక పెద్ద సమస్యగా ఉంటే.. తాజాగా మరో కొత్త సమస్య హస్తినను వెంటాడుతోంది. తాగునీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి దాకా బెంగళూరు నీటి సమస్యతో చాలా ఇక్కట్లు పడింది. ఇప్పుడు ఢిల్లీ వంతు వచ్చింది. ప్రజలు కనీస అవసరాలకు నీళ్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా నీటికొరత వేధిస్తుండటంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.
ఇది కూడా చదవండి: Lucky Bhaskar: పవన్ కళ్యాణ్ తో పోటీకి దిగిన దుల్కర్ సల్మాన్
నీటి పైపులతో కార్లను కడగడం, వాటర్ ట్యాంకర్లు ఓవర్ ఫ్లో కావడం, వాడుక నీటిని నిర్మాణ, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి అతిషి ఆదేశించారు. ఇందుకోసం ఢిల్లీ వ్యాప్తంగా 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Side effects of smoking: ధూమపానంతో పురుషులు లైంగిక శక్తిని కోల్పోతారా?
గురువారం ఉదయం 8 గంటల నుంచి బృందాలను రంగంలోకి దించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ జల్‌బోర్డు సీఈవోకు రాసిన లేఖలో అతిశీ పేర్కొన్నారు. నిర్మాణ స్థలాలు, వాణిజ్య సంస్థల్లో ఏవైనా అక్రమ నీటి కనెక్షన్లు ఉంటే తొలగించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ కుట్రతో తాగునీటి కష్టాలు వచ్చాయని ఢిల్లీ పోలింగ్‌కు ముందు మంత్రి అతిషి ఆరోపించారు. హర్యానా సర్కార్‌తో కుట్ర పన్ని తాగునీటి కష్టాలు కేంద్రం రప్పించిందని ఆమె పేర్కొన్నారు. ఇక హర్యానా నుంచి తమకు రావాల్సిన నీటి వాటా కోసం ఆప్ సర్కార్ పోట్లాడుతుందని మంత్రి తాజాగా వెల్లడించారు.
दिल्ली सरकार की जल मंत्री आतिश ने जारी किए निर्देश ‼️
👉 पानी की बर्बादी को रोकने के लिए जल बोर्ड के सीईओ को जारी किए निर्देश
👉 निर्देश में पानी की बर्बादी रोकने के लिए 200 टीमों को गठित करने के लिए कहा गया
👉पाइप के जरिए गाड़ी धोना, पानी के टैंक का ओवरफ्लो होना और घरेलू पानी… pic.twitter.com/FNUESlxmY9
— AAP (@AamAadmiParty) May 29, 2024