Dulquer Salmaan Lucky Baskhar to release on 27th September: మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. మంచి కథలను ఎంచుకుంటూ తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లెఫ్టినెంట్ రామ్ గా గుర్తుండిపోయారు. సీతా రామం సినిమాతో దుల్కర్ తెలుగు కుర్రాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇక జయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలు అన్ని భాషల్లో చేసుకుంటూ పోతున్నాడు. సీతా రామం తరువాత తెలుగులో దుల్కర్ నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. గత ఏడాది సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Youtuber Arrest: సన్యాసులను వేధించిన కేసులో యూట్యూబర్ కు జైలు శిక్ష..
ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి అదేరోజున పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అదే డేట్ ను ఏ సినిమా ఎంచుకోవడం మీద చర్చ జరుగుతోంది. బహుశా పవన్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో అనేది. ఇక ఈ సినిమాలో దుల్కర్ లక్కీ భాస్కర్ గా ఒక బ్యాంక్ క్యాషియర్ గా కనిపించనున్నాడు. సార్ కు సంగీతం అందించిన జీవి ప్రకాషే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అదే డేటుకు తీసుకు వస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.