Delhi Services Bill: రేపు రాజ్యసభకు ఢిల్లీ సర్వీసుల బిల్లు.. ఆప్, కాంగ్రెస్‌లు విప్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Services Bill: ఢిల్లీ సర్వీసుల బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రేపు(సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని, దీనిపై ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా అవి రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవేనని అమిత్‌షా లోక్‌సభలో బిల్లు ప్రవేశపెడుతూ వ్యాఖ్యానించారు. ఈ బిల్లును జులై 25న కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
Also Read: TS Assembly: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం
Also Read
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన రాజ్యసభ సభ్యులకు ఆగస్టు 7, 8 తేదీల్లో సభకు హాజరు కావాలని కోరుతూ మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఢిల్లీ బ్యూరోక్రసీపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణను ఇచ్చే ఆర్డినెన్స్‌ను భర్తీ చేయడానికి ఉద్దేశించిన వివాదాస్పద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు రాజ్యసభలో చర్చకు, ఆమోదానికి రానున్నందున ఆప్ సభ్యులు తమ వైఖరిని తెలియజేయాలని విప్ జారీ చేసింది. “రాజ్యసభలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులందరూ దయచేసి ఆగస్టు 7, 8 తేదీల్లో సభ వాయిదా పడే వరకు దయచేసి పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడవచ్చు” అని విప్ చదివారు. ఈ బిల్లుపై ఆప్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా సోమవారం హాజరు కావాలని తమ రాజ్యసభ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. విపక్షాల వాకౌట్ మధ్య, దాదాపు ఐదు గంటల చర్చ తర్వాత బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజ్యసభకు బిల్లు వచ్చే సమయంలో దీనిని వ్యతిరేకించాలంటూ గత రెండు నెలలుగా కేజ్రీవాల్ విపక్ష నేతలను కలుసుకుని మద్దతు సమీకరిస్తున్నారు.
Also Read: Gaddar: ఐసీయూలోనూ పాటమ్మను వదలని ప్రజా గాయకుడు
రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగానే.. కాంగ్రెస్ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభలో ప్రతిపక్షం వైపు నుంచి చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. అభిషేక్ మను సింఘ్వీ కూడా ఢిల్లీ ప్రభుత్వం తరపున ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదించారు. కాగా, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన రోజే చర్చ ప్రారంభించి, సాయంత్రం ఓటింగ్ నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!