Pollution Updates: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో విషపూరితమైన గాలి ఆస్తమా, శ్వాసకోశ రోగులకు టెన్షన్‌ను పెంచింది. దీపావళికి ముందే ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. న్యూఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో తెల్లవారుజామున 1 గంటలకు గాలి నాణ్యత సూచిక (AQI) స్థాయి 999 వద్ద నమోదైంది. ఇతర ప్రాంతాలలో కూడా కాలుష్యం కారణంగా పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.
Read Also:Nepal Earthquake: 157కు చేరుకున్న నేపాల్ భూకంపం మృతుల సంఖ్య.. ఇంకా భయంలోనే ఢిల్లీవాసులు
వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం లేదు. కాలుష్యం నుండి ఉపశమనం పొందే ఆశ లేదు. పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వ చర్యలు సరిపోవు. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ సహా NCR లోని అన్ని ప్రాంతాలలో ఉదయం పూట ఆకాశంలో పొగమంచు ఉంది. దీని కారణంగా రోడ్లపై విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్య పరిస్థితి చాలా భయంకరంగా మారవచ్చు. ప్రభుత్వం పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పరిగణించి తక్షణమే చర్యలు తీసుకోవాలి.
Read Also:Madhusudan : ఇది కేవలం కుట్రపూరిత రాజకీయం