Kejriwal: అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో వాదనలు.. తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఇరు పక్షాలు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును ధర్మాసనం గురువారానికి రిజర్వ్ చేసింది.
మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న తిరిగి హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అరెస్టు, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
హైకోర్టులో ఈడీ తరఫున ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్.. డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ తరపు న్యాయవాది వెల్లడించారు. లిక్కర్ కేసులో డబ్బుకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా గుర్తించినట్లు తెలిపారు. హవాలా ద్వారా వందల కోట్లు ఆప్ పార్టీకి అందాయని… ఆ డబ్బంతా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారని.. వ్యవహారాలన్నింటికీ ఆయనే బాధ్యత వహిస్తారన్నారు. ఇండో స్పిరిట్ బ్లాక్ లిస్ట్ దానికి హోల్ సేలర్ లైసెన్స్ ఎలా ఇచ్చారని.. హోల్ సేల్ దుకాణాలకు 5 శాతం ఉన్న లాభాలను 12 శాతానికి పెంచి.. పెరిగిన 7 శాతం లాభాలను ముడుపుల రూపంలో ఆప్ తీసుకుందని ఈడీ లాయర్ చెప్పుకొచ్చారు. ఆప్ మీడియా ఇంఛార్జ్ విజయ్ నాయర్ లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషించారని.. ఆధారాలు దొరకకుండా చేసేందుకు కోట్ల రూపాయల ఫోన్లను ధ్వంసం చేశారన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా ఉన్నారని ఈడీ వాదనలు వినిపించింది.
కేజ్రీవాల్‌ను ఉద్దేశ్వపూర్వకంగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆప్‌ను బలహీనపర్చేందుకే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని అభిషేక్ స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారం (04-04-2024) మధ్యాహ్నానికి ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!