Delhi Fire Accident: ఢిల్లీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ముండ్కా ఫైర్ ఆక్సిడెంట్ లో ఇప్పటి వరకు 27 మరణించగా… 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోెంది. పశ్చిమ ఢిల్లీ ముడ్కా మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. నిన్న ఘటన జరిగిన వెంటనే 24 ఫైర్ ఇంజిన్ల ద్వరా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 50 మందిని రక్షించారు. అయితే చాలా మంది ఆచూకీ కనిపించడం లేదని తెలుస్తోంది. బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒకే ఒక మార్గం ఉండటం… అది కూడా ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భవనంలో ఎలాంటి భద్రత ప్రమాణాలు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం వివిధ కంపెనీ కార్యాలయాలు ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. సీసీటీవీ కెమెరాలు, రూటర్లు తయారు చేసే కంపెనీ కార్యాలయంలోని ఉన్న మొదటి అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. నిమిషాల వ్యవధిలోనే అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు ఫోరెన్సిన్ టీం రంగంలోకి దిగింది. కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
ఢిల్లీ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఢిల్లీలోని ముండ్కాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని … అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..